Godfather in OTT: మెగాస్టార్ 'గాడ్ ఫాదర్' ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?

Godfather in OTT: మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కలిసి నటించిన 'గాడ్ ఫాదర్' సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇది ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే..  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 19, 2022, 08:25 AM IST
  • ఓటీటీలోకి వచ్చేసిన చిరు మూవీ
  • నేటి నుంచి స్ట్రీమింగ్
  • ఏ ఓటీటీ ప్లాట్ ఫాంలో తెలుసా
Godfather in OTT: మెగాస్టార్ 'గాడ్ ఫాదర్' ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?

Godfather in OTT: మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ మోహన్ రాజా కాంబోలో రీసెంట్ గా వచ్చిన చిత్రం 'గాడ్ ఫాదర్' (Godfather). దసరా కానుకగా వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద భారీగానే వసూళ్లు సాధించింది.  మలయాళీ మూవీ ‘'లూసీఫర్‌'కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సత్యదేవ్, నయనతార, సల్మాన్ ఖాన్ కీలక పాత్రలలో నటించారు. సునీల్, షఫీ, అనసూయ, పూరి జగన్నాధ్ తదితరులు ఇతర పాత్రల్లో నటింటారు. ఈ మూవీకి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. 

థియేటర్లలో దుమ్ములేపిన ఈ సినిమా తాజాగా ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయింది. గాడ్ ఫాదర్’ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇవాల్టి నుంచి (నవంబరు 19) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇది తెలుగు, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మాత ఆర్.బీ చౌదరి నిర్మించారు. ఇప్పటికే దసరా రోజు రిలీజైన నాగార్జున ది ఘోస్ట్, రీసెంట్ గా కార్తీ నటించిన సర్దార్ సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.  

కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలి పాత్రలో కనిపించారు. అలాగే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ చిత్రంలో అతిధి పాత్రలో కనిపించడమే కాకుండా స్పెషల్ సాంగ్ లో కూడా మెరిశారు. ఆచార్య డిజాస్టర్ తర్వాత ఈ సినిమాతో  ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నారు చిరంజీవి. ప్రస్తుతం చిరంజీవి వాల్తేరు వీరయ్య, బోళా శంకర్ చిత్రాల్లో నటిస్తున్నారు. 

Also Read: PS-1 Total Collections: రూ. 500 కోట్ల కలెక్షన్లతో సంచలనం సృష్టించిన పొన్నియిన్ సెల్వన్-1 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News