Acharya Failure: 80% రెమ్యూనరేషన్ వదులుకున్న చిరు-చెర్రీ.. ఆచార్య పేరు ఎత్తని మెగాస్టార్

Chiranjeevi on Acharya Losses" చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఎంతగా తేడా కొట్టేసిందో అందరికీ తెలిసిందే. దారుణమైన నష్టాలను తెచ్చి పెట్టిన చిత్రంగా ఆచార్య నిలిచింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 14, 2022, 11:07 AM IST
  • గాడ్ ఫాదర్ సక్సెస్ మూడ్‌లో చిరంజీవి
  • ఆచార్య నష్టాలపై మెగాస్టార్ కామెంట్స్
  • ఆచార్య పేరు ఎత్తేందుకు ఇష్టపడని చిరు
Acharya Failure: 80% రెమ్యూనరేషన్ వదులుకున్న చిరు-చెర్రీ.. ఆచార్య పేరు ఎత్తని మెగాస్టార్

Chiranjeevi  Acharya Remuneration : మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా మీదున్న హైప్, దాని రిజల్ట్ అందరికీ తెలిసిందే. కొరటాల శివ లాంటి దర్శకుడు.. ఓ మూడేళ్లు వెచ్చించడం, ఆచార్య కోసం వెయిట్ చేయడం, మెగాస్టార్ చిరంజీవి నటించడం, అందులో మెగా పవర్ స్టార్ ఓ రోల్ చేయడం, తండ్రీ కొడుకులు కలిసి నటించిన మొదటి చిత్రం కావడం.. ఇలా ఎన్నెన్నో అంశాలతో ఆచార్య మీద ఆకాశన్నంటే అంచనాలు నెలకొన్నాయి.

సినిమా విడుదలకు ముందు మెగాస్టార్ చిరంజీవి కూడా ఆచార్య గురించి ఎంతో గొప్పగా చెప్పాడు. కొరటాలను పొగిడేశాడు. ఆయన మేకింగ్ అంటే చాలా ఇష్టమని ఇలా ఎంతెంతో పొగిడేశాడు. ఆచార్య సినిమా షూటింగ్‌ను ఫుల్ ఎంజాయ్ చేశానంటూ రామ్ చరణ్, చిరంజీవిలు చెప్పుకొచ్చారు. అయితే సినిమా విడుదలయ్యాక, ఫలితం వచ్చాక పరిస్థితులు మారిపోయాయి.

ఆచార్య దారుణంగా బెడిసి కొట్టేసింది. దారుణమైన నష్టాలను తీసుకొచ్చింది. బిజినెస్ అంతా కూడా కొరటాల శివ దగ్గరుండి చూసుకున్నాడట. దీంతో బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లంతా కూడా కొరటాల ఆఫీస్ మీద పడ్డారు. కొరటాల కథ మీద కాకుండా బిజినెస్ మీద ఫోకస్ పెట్టాడని, అందుకే తేడా కొట్టేసిందని అందరూ వేలెత్తి చూపించారు. చిరంజీవి సైతం కొరటాలను, ఆచార్యను దూరం పెట్టినట్టు అనిపించింది.

 ఆచార్య తేడా కొట్టేసిన తరువాత వెంటనే చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి విదేశాలకు వెళ్లి చిల్ అయ్యాడు. అయితే ఆచార్య నష్టాలను భరించేందుకు కొరటాల తన ఆస్థులను అమ్మేసుకున్నట్టు టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం చిరంజీవి ఇంకో రకంగా చెప్పేశాడు. ఆచార్య సినిమాలో కొణిదెల కూడా ఓ నిర్మాణ భాగస్వామినే.

ఆచార్య కోసం చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ కూడా దాదాపు 80 శాతం రెమ్యూనరేషన్ వాపస్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు చిరంజీవి కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడట. 'ఏప్రిల్‌లో వచ్చిన గత చిత్రం నిరాశ పరిచింది. దానికి చేయాల్సిన ధర్మం చేశాను. దానిని చెప్పుకుంటే చిన్నదైపోతుంది. చాలా పెద్ద మొత్తం నాది కాదని వదిలేశాను. రామ్ చరణ్‌ కూడా వదిలేశాడు. నేను వదులకున్నది బయ్యర్లను కాపాడుతుందనే సంతృప్తి నన్ను ఫ్లాప్‌కి కుంగిపోయేలా చేయలేదు' అని అన్నాడు.

అయితే ఆచార్య అని కూడా పలకేందుకు ఇష్టం పడటం లేదా? అని నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే ఇలా రెమ్యూనరేషన్ వెనక్కి ఇవ్వడం మీద గతంలో 20 శాతం వెనక్కి ఇచ్చారని టాక్ వచ్చింది. ఇప్పుడు 80 శాతం అని అంటున్నారు. అసలు ఇందులో ఏది నిజమని నెటిజన్లు తలలు గోక్కుంటున్నారు.

Also Read : Karwa chauth 2022 : కర్వాచౌత్ స్పెషల్.. కొత్త జంటల సందడి.. కత్రినా-విక్కీ జోడి పిక్స్ వైరల్

Also Read : "మా"కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా, ధర్నాలు చేసినా సస్పెండ్ చేస్తాం: మంచు విష్ణు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News