Jithender Reddy: యాక్షన్ డ్రామాగా 'జితేందర్ రెడ్డి'.. ఏడేళ్ల తరువాత హిట్ డైరెక్టర్ కొత్త మూవీ

Jithender Reddy Title Poster: జితేందర్ రెడ్డి మూవీ టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు ప్రముఖ దర్శకుడు దేవా కట్టా. ఈ సినిమాకు విరించి వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు ఏడేళ్ల తరువాత మళ్లీ మెగా ఫోన్ పట్టారు. పూర్తి వివరాలు ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 9, 2023, 08:23 PM IST
Jithender Reddy: యాక్షన్ డ్రామాగా 'జితేందర్ రెడ్డి'.. ఏడేళ్ల తరువాత హిట్ డైరెక్టర్ కొత్త మూవీ

Jithender Reddy Title Poster: ఉయ్యాల జంపాల, మజ్ను వంటి సూపర్ హిట్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ విరించి వర్మ. దాదాపు ఏడేళ్ల గ్యాప్ తరువాత సరికొత్త సినిమాతో ఆడియన్స్‌కు రాబోతున్నాడు.  1980 బ్యాక్‌డ్రాప్‌ జరిగే ఒక పిరియడిక్ కథగా రూపొందుతున్న జితేందర్ రెడ్డి అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్‌పై ముదుగంటి  రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను డైరక్టర్ దేవకట్టా  రిలీజ్ చేశారు. తెలంగాణ నేపథ్యంలో నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. సీరియస్ యాక్షన్ డ్రామా కథగా ఈ మూవీ ఉండబోతున్నట్లు చిత్రం బృందం చెబుతున్నారు.  

కెమెరామెన్‌గా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వీఎస్ జ్ఞానశేఖర్ వ్యవహరిస్తున్నాడు. గోపిసుందర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఆర్ట్ డైరెక్టర్‌గా నాగేంద్ర కుమార్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో రెండు ప్రేమ కథా చిత్రాలను అందించిన విరించి వర్మ.. ఈ సారి డిఫరెంట్ కాన్సెప్ట్‌ను ఎంచుకున్నాడు. పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాతో మాస్ ఆడియన్స్‌ను టార్గెట్‌ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి టైటిల్ పోస్టర్‌ను మాత్రమే రిలీజ్ చేయగా.. నటీనటుల వివరాలను ఇంకా వెల్లడించాల్సి ఉంది. త్వరలోనే ఫస్ట్‌ లుక్‌ను కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్. 

విరించి వర్మ విషయానికి వస్తే.. 2013లో ఉయ్యాల జంపాలతో మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. బావ-మరదలి ప్రేమ కథను తెరపై చక్కగా చూపించి సూపర్ హిట్ అందుకున్నారు. ఈ మూవీ ద్వారానే రాజ్ తరుణ్, అవికా గోర్ హీరోహీరోయిన్స్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తరువాత నాని-అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రలలో నటించిన మజ్ను చిత్రానికి కూడా దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం 23 సెప్టెంబర్ 2016న ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్‌గా నిలిచింది. మళ్లీ ఏడేళ్ల గ్యాప్ తరువాత సరికొత్త థీమ్‌తో ప్రేక్షకులను అలరించనున్నాడు. 

Also Read: IND vs PAK Dream11 Prediction Today Match: పాక్‌తో టీమిండియా బిగ్‌ఫైట్‌.. పిచ్ రిపోర్ట్, డ్రీమ్11 టీమ్ టిప్స్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇలా..  

Also Read: Chandrababu Arrest Latest Updates: చంద్రబాబే ప్రధాన కుట్రదారు.. పదేళ్ల జైలు శిక్షకు అవకాశం: ఏపీ సీఐడీ చీఫ్‌

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News