Racharikam Movie Trailer: అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ కీలక పాత్రల్లో సురేశ్ లంకలపల్లి, ఈశ్వర్ వాసె దర్శకత్వంలో రూపొందిన మూవీ రాచరికం. చిల్ బ్రోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈశ్వర్ నిర్మించారు. ఈ సినిమా నుంచి విడుదలైన కంటెంట్, సాంగ్స్, పోస్టర్లతో మంచి బజ్ క్రియేట్ అయింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను స్టార్ డైరెక్టర్ మారుతి రిలీజ్ చేశారు. అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ కనిపించిన తీరు చాలా డిఫరెంట్‌గా ఉంది. లుక్స్ సరికొత్తగా ఉండగా.. నటించిన విధానం అదిరిపోయింది. విలేజ్ పొలిటికల్ రివేంజ్ డ్రామాగా రూపొందించిన ఈ మూవీ ట్రైలర్ ఆద్యంతం అలరించేలా కట్ చేశారు.
ట్రైలర్‌లో డైలాగ్స్ సూపర్‌గా ఉన్నాయి. "రాచకొండ ఒక అడవి లాంటిదబ్బా.. ఈడ బలంతో పోరాడే పులులు, బలగంతో పోరాడే ఏనుగులు, ఎత్తుకు పై ఎత్తు వేసే గుంట నక్కలు, కాసుకుని కాటేసే విష సర్పాలు ఉంటాయి.. వాటి మధ్య జరిగే పోరులో రక్త పాతాలే తప్పా రక్త సంబంధాలు ఉండవు" చెప్పిన డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఇక పొలిటికల్ డైలాగ్స్‌ను కూడా వాడేశారు. గతంలో వైఎస్ షర్మిల చేసిన కామెంట్స్‌ను పెట్టేశారు. "చిన్న కరెక్షన్ సార్.. ఆడ పిల్ల పెళ్లైతేనే ఆడ పిల్ల అయితుంది గానీ.. ఈడ పిల్ల అవ్వదు.." అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. "సీఎం.. పీఎం.. అవ్వాలంటే జైలుకెళ్లడం ఒక క్వాలిఫికేషన్ అవుతాది.." అంటూ చెప్పిన డైలాగ్ ఇటీవల కేటీఆర్ చెప్పిన కామెంట్స్ నుంచి తీసుకున్నారు. ఈ డైలాగ్ వస్తున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో వరుణ్ సందేశ్ జైలులో నడుచుకుంటూ కనిపించాడు.
ఇక విజువల్స్, యాక్షన్, బీజీఎం ఇలా అన్నీ నెక్స్ట్ లెవెల్లో తీర్చిదిద్దినట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ వేంగి, ఆర్య సాయి కృష్ణ కెమెరా వర్క్, రామ్ ప్రసాద్ మాటలు సినిమాకు మరింత ప్లస్ కానున్నాయి. ఫిబ్రవరి 1న థియేటర్లలో రాచరిక మూవీ సందడి చేయనుంది.
టెక్నికల్ టీమ్
==> బ్యానర్: చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్
==> ప్రొడ్యూసర్: ఈశ్వర్
==> డైరెక్షన్: సురేష్ లంకపల్లి, ఈశ్వర్ వాసె
==> ఎడిటర్: జేపీ
==> DOP: ఆర్య సాయి కృష్ణ
==> మ్యూజిక్: వేంగి
==> PRO: సాయి సతీష్
Also Read: Ys Jagan Schedule: ఈ నెలాఖరు నుంచి జిల్లాల పర్యటన జగన్ షెడ్యూల్ ఫిక్స్ ఎలా ఉంటుందంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.