Ram Gopal Varma: రేపే దిశా ఎన్‌కౌంటర్ ట్రైలర్

యథార్థ సంఘటనలను సినిమాలుగా మరల్చడంలో దర్శకుడు రామ్ ‌గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) ఎప్పుడూ ముందుంటారు. రాజకీయ పరిణామాలు కావొచ్చు.. క్రైం సంఘటనలు కావొచ్చు.. ఆయన స్పందించే విధానం.. ఆలోచన రీతి పలు కోణాల్లో భిన్నంగా ఉంటుంది. 2019 నవంబ‌ర్‌లో తెలంగాణ‌లో జ‌రిగిన దిశా (disha) అత్యాచార, హత్య సంఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విష‌యం తెలిసిందే.

Last Updated : Sep 25, 2020, 01:29 PM IST
Ram Gopal Varma: రేపే దిశా ఎన్‌కౌంటర్ ట్రైలర్

DISHA ENCOUNTER Trailer releasing tomorrow: యథార్థ సంఘటనలను సినిమాలుగా మరల్చడంలో దర్శకుడు రామ్ ‌గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) ఎప్పుడూ ముందుంటారు. రాజకీయ పరిణామాలు కావొచ్చు.. క్రైం సంఘటనలు కావొచ్చు.. ఆయన స్పందించే విధానం.. ఆలోచన రీతి పలు కోణాల్లో భిన్నంగా ఉంటుంది. 2019 నవంబ‌ర్‌లో తెలంగాణ‌లో జ‌రిగిన దిశా (disha) అత్యాచార, హత్య సంఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విష‌యం తెలిసిందే. నలుగురు మానవ మృగాలు ఒక యువతిపై అత్యంత పైశాచికంగా దాడి చేసి ఓ యువతిని పొట్టనపెట్టుకున్నారు. అయితే.. ఈ అత్యాచార, హత్య సంఘ‌ట‌న, ఆ తర్వాత నిందితుల ఎన్‌కౌంటర్ ఆధారంగా రామ్ గోపాల్ వర్మ ‘దిశా ఎన్‌కౌంటర్’ (DISHA ENCOUNTER ) సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా దాని గురించి అప్డేట్ ఇచ్చారు వర్మ. ఇంటెన్స్ థ్రిల్ల‌ర్‌ అండ్ ఎమోషనల్‌ సెంటిమెంట్‌తో రూపొందిస్తున్న ఈ సినమా ట్రైలర్‌ను శనివారం ఉదయం రిలీజ్ చేస్తున్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా సమాచారమిచ్చారు. ఈ మూవీ ట్రైల‌ర్‌ను రేపు ఉద‌యం 9.08 నిమిషాల‌కు విడుదల చేయనున్నట్లు రాంగోపాల్‌ వ‌ర్మ ట్విట్‌లో పేర్కొన్నారు. 

అయితే.. వర్మ తీస్తున్న దిశా ఎన్‌కౌంటర్ చిత్రానికి ఆనంద్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండగా.. నట్టి కరుణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌కి సంబంధించి అప్టేట్ ఇస్తూనే రామ్ గోపాల్ వర్మ.. ఓ యువ‌తి రోడ్డు ప‌క్క‌న బ్యాగు వేసుకుని నిల్చున్న పోస్ట‌ర్‌ను ట్విట‌ర్ ద్వారా పంచుకున్నారు. అయితే.. ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తున్న హీరియిన్ ఎవ‌ర‌నేది మాత్రం ఎప్పటిలాగానే వర్మ సస్పెన్స్‌లో పెట్టారు. ఈ సినిమాలో వర్మ దిశా అత్యాచార సంఘటన హత్య నేప‌థ్యం, నిందితుల‌ను పోలీసులు పట్టుకున్న విధానం.. ఆతర్వాత ఎన్‌కౌంట‌ర్.. దేశ‌వ్యాప్తంగా జరిగిన ఆందోళనలను ఈ సినిమాలో వర్మ చూపించనున్నారు. యథార్థ సంఘటనలు కళ్లకు కట్టినట్టు చూపించే వర్మ.. దిశా సంఘటనను ఎలా చూపించనున్నారనేది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. Also read: Pawan Kalyan: రెమ్యునరేషన్ విషయంలో పవన్ కళ్యాణ్ రూటు మారిందా?

అయితే అంతకుమందు ఏపీ రాజకీయాలపై పవర్ స్టార్ (powerstar) సినిమా తీసి వివాదంలో చిక్కుకున్నారు. ఆ తర్వాత ఆయన మిర్యాలగూడెం ప్రణయ్ హత్య ఆధారంగా మర్డర్ (murder) సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఆ చిత్రం కూడా వివాదంలోనే ఉంది. ఏదీఏమైనప్పటికీ దిశా అత్యాచర సంఘటనపై వర్మ తీస్తున్న ఈ సినిమాపై ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది.  Also read: Drugs Case: ఎన్‌సీబీ కార్యాలయానికి చేరుకున్న నటి రకుల్

Trending News