Divyansha Kaushik: మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన నాగ చైతన్య హీరోయిన్.. పాన్ ఇండియా మూవీలో ఛాన్స్!!

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న 'మైఖేల్' సినిమాలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‏గా ఎంపికైనట్టు సమాచారం తెలుస్తోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 19, 2021, 11:59 AM IST
  • మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన నాగ చైతన్య హీరోయిన్
  • పాన్ ఇండియా మూవీలో దివ్యాంశ కౌశిక్
  • యంగ్ హీరోయిన్‏కు మరో లక్కీ ఛాన్స్
Divyansha Kaushik: మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన నాగ చైతన్య హీరోయిన్.. పాన్ ఇండియా మూవీలో ఛాన్స్!!

Divyansha Kaushik to act with Sundeep Kishan in Michael movie: అక్కినేని నాగ చైతన్య హీరోగా వచ్చిన 'మజిలీ' సినిమాతో యంగ్ హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ (Divyansha Kaushik) తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తన అందం, నటనతో తొలి సినిమాతోనే ఆకట్టుకున్నారు. మజిలీ (Majili) సినిమాలో సమంతకు ధీటుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మొదటి మూవీతోనే సూపర్ హిట్ అందుకున్న దివ్యాంశ కౌశిక్.. తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటున్నారు. ప్రస్తుతం శరత్ మండవ దర్శకత్వంలో మాస్ మాహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న 'రామారావు ఆన్ డ్యూటీ' అనే చిత్రంలో నటిస్తోన్న దివ్యాంశకు మరో బంపర్ ఆఫర్ వచ్చింది. 

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న 'మైఖేల్' (Michael) సినిమాలో దివ్యాంశ కౌశిక్ (Divyansha Kaushik) హీరోయిన్‏గా ఎంపికైనట్టు సమాచారం తెలుస్తోంది. దర్శకుడు చెప్పిన కథ దివ్యాంశకు నచ్చిందని ఫిల్మ్ నగర్ టాక్. అధికారిక ప్రకటన వెలుబడమే ఆలస్యం అట. ఈ సినిమా కోసం తమిళం మరియు తెలుగు భాషలలో శిక్షణ తీసుకుంటున్నారట. 23 ఏళ్ల ఈ ఢిల్లీ భామ మొదటగా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. 2016లో వచ్చిన టక్కర్ అనే తమిళ్ సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చారు. అయితే ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు. ఆపై 2019లో వచ్చిన మజిలీ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ సినిమాలో దివ్యాంశకు మంచి మార్కులు పడడంతో ఇక్కడ ఆఫర్లు వస్తున్నాయి. 

Also Read: Virat Kohli vs Sourav Ganguly: కోహ్లీ యాటిట్యూడ్‌ ఇష్టమే.. కానీ అతడిలో ఆ లక్షణమే నాకు అస్సలు నచ్చదు: గంగూలీ

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి (Vijay Sethupathi) అతిధి పాత్రలో నటిస్తున్నాడు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ , హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రంజిత్ జయకోడి (Ranjith Jeyakodi) దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, కరణ్ సి ప్రొడక్షన్ ఎల్ఎల్పి బ్యానర్లపై నారాయణ్ దాస్ కె నారంగ్ సమర్పణంలో భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Menon) విలన్ పాత్రలో నటిస్తున్నాడు. గల్లీ రౌడీతో మంచి విజయాన్ని అందుకున్న సందీప్ కిషన్.. ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. 

Also Read: Gold Price Today: స్థిరంగా బంగారం ధర, దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధర

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News