Game changer ticket hikes: సంక్రాంతికి విడుదలవుతున్న చిత్రాలలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలయ్య డాకు మహారాజ్ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సినిమాల విడుదల సమయంలో.. ఈ సినిమా టికెట్ల వ్యవహారం పై నిన్న హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజున ఈ కేసుకు సంబంధించి హైకోర్టు తుది తీర్పును వెల్లడించింది. దీంతో ఈ రెండు చిత్రాలకు ఒక్కసారిగా షాక్ తగిలినట్లు తెలుస్తోంది.
గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలు రెండూ భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమాలు కావడంతో ఈ సినిమాలకు 14 రోజులు పాటు టికెట్ ధరలను పెంచుకునే అనుమతిని ఏపీ ప్రభుత్వం ఇవ్వగా.. ఇది విరుద్ధమంటూ ఒక పిటిషన్ వేశారట. ఈ పిటిషన్ ఈ రోజున విచారణ జరిపించగా.. కోర్టు కేవలం 10 రోజులు మాత్రమే టికెట్ ధరలను పెంచుకునేలా ఉత్తరులను జారీ చేసింది. దీంతో కచ్చితంగా ఈ ప్రభావం సినిమా కలెక్షన్స్ పైన పడుతుందని పలువురు సినీ విశ్లేషకులు కూడా తెలియజేస్తున్నారు.
అయితే సాధారణ ప్రేక్షకులు మాత్రం కోర్టు నిర్ణయం పైన ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. ఇదంతా ఇలా ఉండగా రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న మొట్టమొదటి సినిమా గేమ్ ఛేంజర్.. ఈ సినిమా జనవరి 10న రిలీజ్ కాబోతోంది.ఇక బాలయ్య, డైరెక్టర్ బాబి దర్శకత్వంలో రాబోతున్న సినిమా డాకు మహారాజ్. ఈ సినిమా జనవరి 12వ తేదీన రిలీజ్ కాబోతోంది..
కేవలం రెండు రోజుల వ్యవధిలోనే మూడు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నాయి. ఇప్పటికే సినిమాల ట్రైలర్లను విడుదల చేయగా భారీ హైప్ ఏర్పడినప్పటికీ.. మరి సినిమా పరంగా కలెక్షన్స్ పరంగా ఏ సినిమా సంక్రాంతికి విన్నింగ్ అవుతుందో చూడాలి. ఇకపోతే ఈ రెండు సినిమాలతో పాటు వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా విడుదల కాబోతోంది ఈ సినిమా జనవరి 14వ తేదీన రిలీజ్ కాబోతోంది.
Read more: Sreeleela: సైఫ్ అలీఖాన్ కొడుకుతో డేటింగ్‌లో శ్రీలీల..?.. ఇద్దరు సీక్రెట్‌గా ఏంచేస్తున్నారో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter