'గాయత్రి' టీజర్‌లో ఆయన ఎంట్రీ అదుర్స్

విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా 'గాయత్రి'

Updated: Jan 13, 2018, 03:47 PM IST
'గాయత్రి' టీజర్‌లో ఆయన ఎంట్రీ అదుర్స్

విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా 'గాయత్రి'. 'పెళ్లైన కొత్తలో' ఫేమ్ మదన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైంది. 'రామాయ‌ణంలో రాముడికి, రావ‌ణాసురుడికి గొడ‌వ‌. మ‌హాభార‌తంలో పాండ‌వుల‌కి, కౌర‌వుల‌కి మాత్రమే గొడ‌వ. వాళ్లూ వాళ్లూ కొట్టుకొని ఎవరో ఒకరు చనిపోయినట్లయితే బాగుండేది. కానీ, వారి మూలంగా జరిగిన యుద్ధంలో అటూ ఇటూ కొన్ని లక్షల మంది సైనికులు చనిపోయారు. 

పురాణాల్లో వాళ్ళు చేసింది త‌ప్పు అయితే.. ఇక్కడ నేను చేసింది కూడా త‌ప్పే. అక్కడ వాళ్ళు దేవుళ్ళు అయితే ఇక్కడ నేనూ దేవుడినే. అర్ధం చేసుకుంటారో, అపార్థం చేసుకుంటారో .. ఛాయిస్ ఈజ్ యువ‌ర్స్' అనే పవర్‌ఫుల్ డైలాగ్‌తో మోహన్‌‌బాబు ఇచ్చిన ఎంట్రీపై ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఆయన అభిమానులు. ఫిబ్రవరి 9 తేదిన విడుద‌ల కానున్న ఈ సినిమాలో మోహన్ బాబు డబుల్ రోల్ చేయబోతున్నారు. మంచు విష్ణు, శ్రేయ, నిఖిల ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.