Gully Rowdy Teaser: గల్లీ రౌడీ టీజర్ రిలీజ్ చేసిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ

Gully Rowdy Teaser: టాలీవుడ్ రౌడీ హీరోగా మారిపోయిన విజయ్ దేవరకొండ చేతుల మీదుగా సందీప్ కిషన్ లేటెస్ట్ మూవీ గల్లీ రౌడీ టీజర్ రిలీజ్ చేశారు.  సందీప్ కిషన్‌కు జోడీగా నటి నేహా శెట్టి నటించింది.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 19, 2021, 06:10 PM IST
Gully Rowdy Teaser: గల్లీ రౌడీ టీజర్ రిలీజ్ చేసిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ

Gully Rowdy Teaser: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ గల్లీ రౌడీ. వైవిధ్యానికి ప్రాధాన్యమిస్తూ తనదైన పంథాలో ముందుకు వెళ్లే నటులలో సందీప్ కిషన్ ఒకరని చెప్పవచ్చు. కామెడీ, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న గల్లీ రౌడీ మూవీ నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది. టీజర్‌లో ఆకట్టుకున్న పదం నెపోటిజం.

టాలీవుడ్ రౌడీ హీరోగా మారిపోయిన విజయ్ దేవరకొండ చేతుల మీదుగా సందీప్ కిషన్ లేటెస్ట్ మూవీ గల్లీ రౌడీ టీజర్ రిలీజ్ చేశారు. సందీప్ కిషన్‌కు జోడీగా నటి నేహా శెట్టి నటించింది. దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి ఈ కామెడీ, రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్, బాబీ సింహా ఇతర కీలకపాత్రల్లో నటించారు. వచ్చే నెల 21న విడుదల చేయాలని మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది.

Also Read: Vakeel saab: వకీల్ సాబ్ కలెక్షన్లకు కరోనా దెబ్బ కొట్టిందా, ఆ మార్కెట్‌లో ఘోర పరాజయం

ఎవరైనా వాళ్ల మనవడ్ని ఇంజనీర్ చేస్తారు లేక డాక్టర్ చేస్తారు. కానీ రౌడీని చేయడం ఏంటిరా.. అని వైవా హర్ష అడిగే ప్రశ్న సినిమాపై ఆసక్తి రేపుతోంది. ఈ సినిమాకు సాయి రామ్, చౌరస్తా రామ్ మిరియాల సంగీతం సమకూరుస్తున్నారు. గీతాంజలి, నిన్ను కోరి మూవీ మేకర్స్ ఈ గల్లీ రౌడీని టాలీవుడ్ ప్రేక్షకులకు అందిస్తున్నారు. అనుకోని పరిస్థితుల్లో కామెడీ రౌడీగా మారడం, ఊహించని విధంగా కిడ్నాప్ లాంటివి చేయడం టీజర్‌లో వినోదాన్ని పంచుతున్నాయి. 

Also Read: COVID-19 Lockdown: లాక్‌డౌన్ ప్రకటించగానే Wine Shopsకు మందుబాబులు పరుగులు Viral

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News