Skanda Movie: రామ్ 'స్కంద' ఫస్ట్‌ సింగిల్‌ ప్రోమో వచ్చేసింది.. పుల్ సాంగ్ ఎప్పుడంటే?

Skanda Movie: బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లీడ్ రోల్ చేస్తున్న చిత్రం 'స్కంద'. ఈ చిత్రంలో లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 1, 2023, 12:27 PM IST
Skanda Movie: రామ్ 'స్కంద' ఫస్ట్‌ సింగిల్‌ ప్రోమో వచ్చేసింది.. పుల్ సాంగ్ ఎప్పుడంటే?

Skanda First Single Promo: రామ్‌-బోయపాటి కాంబోలో రూపొందుతున్న సినిమా 'స్కంద'(Skanda Movie). యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.  ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత రామ్ కు సరైన హిట్ లేదు. చివరిగా రామ్ నటించిన వారియర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసి మీదఉన్నాడు ఈ ఎనర్జిటిక్ స్టార్. ప్రస్తుతం స్కంద మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. రీసెంట్ గా రిలీజైన గ్లింప్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. 

తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసారు మేకర్స్. ఇంగ్లీష్ వోకల్స్‌తో నీ చుట్టూ చుట్టూ అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమో ఆకట్టుకుంటుంది. థమన్‌ స్వర పరిచిన ఈ పాటకు రఘురామ్‌ సాహిత్యం అందించగా.. సిద్‌ శ్రీరామ్‌, సంజన కల్‌మంజీ ఆలపించారు. ఈ సాంగ్ ఫుల్‌ లిరికల్ వీడియో ఆగస్టు 3న రిలీజ్‌ కాబోతుంది. ఈ సినిమాను  శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. అవుట్‌ ఆండ్‌ అవుట్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్‌ 15న తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News