Bhagavanth Kesari : ఈవారం విడుదలైన లియో, భగవంత్ కేసరి సినిమాల మధ్య ఉన్న కామన్ పాయింట్ ఏంటో తెలుసా?

Leo vs Bhagavanth Kesari: ఈవారం భారీ అంచనాల మధ్య విడుదలైన రెండు సినిమాలు బాలకృష్ణ భగవంత్ కేసరి, దళపతి విజయ్ లియో. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ అందుకున్న ఈ రెండు సినిమాల మధ్య ఉన్న కొన్ని కామన్ పాయింట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పేరు దగ్గర నుంచి మరి ఎన్నో సంబంధాలు ఈ రెండు సినిమాల మధ్య ఉన్నాయి అని ఈ రెండు చిత్రాలు చూసినవారు సోషల్ మీడియాలో పోస్టులు వేస్తున్నారు. అసలు విభిన్నమైన జోనర్లలో వచ్చిన ఈ రెండు సినిమాలు మధ్య ఉన్న కామన్ పాయింట్ ఏంటి? అసలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న పాయింట్స్ ఏంటి ఒకసారి చూద్దాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 21, 2023, 08:48 AM IST
Bhagavanth Kesari : ఈవారం విడుదలైన లియో, భగవంత్ కేసరి సినిమాల మధ్య ఉన్న కామన్ పాయింట్ ఏంటో తెలుసా?

Bhagavanth Kesari:

ఈ సంవత్సరం దసరా పండుగ రాకముందే సినిమా పండుగ మొదలైంది. అభిమానులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొన్ని సినిమాలు ఎట్టకేలకి థియేటర్లలో కళకళలాడాయి. అందులో మొదటిది దళపతి విజయ్ హీరోగా నటించిన లియో కాగా మరొకటి నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి. వారాంతంలో విడుదలైన ఈ రెండు పెద్ద సినిమాలు మంచి కలెక్షన్లతో పాటు మంచి టాక్ ని కూడా సొంతం చేసుకున్నాయి. 

ఖైదీ, విక్రమ్ సినిమాల తరువాత లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన లియో సినిమా మంచి విజయాన్ని అందుకుంది. బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరి సినిమా కూడా అదే స్థాయిలో హిట్ అయింది. నిజానికి ఈ రెండు సినిమా కథల మధ్య ఎటువంటి పొంతన ఉండదు. రెండు విభిన్న జోనర్లకు చెందిన సినిమాలు. ఒకదానితో మరొక దానిని పోల్చడం కూడా కుదరదు.

కానీ తాజా సమాచారం ప్రకారం ఈ రెండు సినిమాల మధ్య కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి అనే వార్త సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. భగవంత్ కేసరి టైటిల్ లో కేసరి అంటే సింహం అని అర్థం వస్తుంది. లియో అన్నా కూడా సింహం అనే అర్థం. ఇది ఈ రెండు సినిమాల మధ్య ఒక కామన్ పాయింట్ గా చెప్పచ్చు. ఇదొక్కటే కాకుండా సినిమాలలో మరికొన్ని కామన్ పాయింట్స్ కూడా ఉన్నాయి. బాలకృష్ణ సినిమాలో విలన్ పాత్ర పోషించిన అర్జున్ రాంపాల్ తన బిజినెస్ కాపాడుకునేందుకు కన్న కొడుకును కూడా చంపేస్తాడు. ఇక ఇదే సన్నివేశం లియో సినిమాలో కూడా కనిపిస్తుంది. కానీ లియో లో కొడుకు తప్పించుకుని బయటపడుతాడు. 

ఇక ఈ రెండు మాత్రమే కాక ఈ రెండు సినిమాలలోను హీరోలు తమ కుటుంబం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. లియో సినిమా కి అనిరుద్ రవిచంద్ర సంగీతాన్ని అందించగా భగవంత్ కేసరి సినిమా కి తమన్ సంగీతాన్ని చేకూర్చారు. ఇక ఈ రెండు సినిమాల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా హిట్ అయింది. 

భగవంత్ కేసరి సినిమాలో బాలకృష్ణ కూతురి పాత్రలో శ్రీ లీల కనిపించగా స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్ బాలయ్య సరసన హీరోయిన్ గా నటించింది. మరోవైపు లియో సినిమాలో త్రిష కృష్ణన్ విజయ్ సరసన హీరోయిన్ గా కనిపించింది.

కాగా ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా ఆడుతున్నాయి లియో పాన్ ఇండియా సినిమా కావడంతో మొదటి రోజే ఎకంగా 140 కోట్లు సాధించింది మరో పక్క బాలకృష్ణ సినిమా తెలుగులో మాత్రం విడుదలై 32 కోట్ల కలెక్షన్లు సాధించింది.

Also Read: CM Jagan: ఏపీలో అర్చకులకు శుభవార్త.. సీఎం జగన్ దసరా గిఫ్ట్  

Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News