Kajal Aggarwal: పెళ్లికి ముందే గౌతమ్‌కు కండిషన్ పెట్టిన కాజల్ అగర్వాల్

ఇటీవలే పెళ్లి చేసుకుని ఒక్కటైన కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు జంట ప్రస్తుతం సోషల్ మీడియాను తమ పోస్టులతో ఏలుతోంది. పెళ్లి చేసుకోవడం మొదలు ఇటీవల హనీమూన్ వరకు ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ఆయా పోస్టులకు వచ్చిన రెస్పాన్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్న ఈ జంట తాజాగా ఓ మీడియా సంస్థకు కలిసి ఇంటర్వ్యూ ఇచ్చారు.

Last Updated : Nov 25, 2020, 11:39 AM IST
Kajal Aggarwal: పెళ్లికి ముందే గౌతమ్‌కు కండిషన్ పెట్టిన కాజల్ అగర్వాల్

ఇటీవలే పెళ్లి చేసుకుని ఒక్కటైన కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు జంట ప్రస్తుతం సోషల్ మీడియాను తమ పోస్టులతో ఏలుతోంది. పెళ్లి చేసుకోవడం మొదలు ఇటీవల హనీమూన్ వరకు ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ఆయా పోస్టులకు వచ్చిన రెస్పాన్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్న ఈ జంట తాజాగా ఓ మీడియా సంస్థకు కలిసి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో కాజల్ అగర్వాల్ గురించి గౌతమ్ కిచ్లు... అలాగే గౌతం కిచ్లు గురించి కాజల్ అగర్వాల్ చాలా ఓపెన్ అయ్యారు. ఇరువురూ ఒకరి గురించి మరొకరు అనేక ఆసక్తికరమైన సంగతులు చెప్పుకున్నారు. 

కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలిసిన ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. చందమామ బ్యూటీ కాజల్ పెళ్లికి ముందే గౌతంకి ఓ కండిషన్ పెట్టిందంట.. అదేంటంటే.. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే.. నువ్వు మోకాళ్లపై ఒంగి నాకు లవ్ ప్రపోజ్ ( Gautam Kitchlu's love proposal ) చేయాలని కోరిందట. అలా చేస్తే తప్ప నేను నిన్ను పెళ్లి చేసుకోను అని తెగేసి చెప్పిందట కాజల్.

Also read : Boycott Netflix: బాయ్‌కాట్ నెట్‌ఫ్లిక్స్ వివాదం.. శివాలయంలో బూతు సన్నివేశాలు

కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal ) డిమాండ్ విన్న గౌతంకి ముందుగా చాలా ఓవర్‌గా అనిపించిందట. కానీ తర్వాత తర్వాత అర్థం చేసుకున్నాడట. సినీ పరిశ్రమ నుంచి వచ్చిన అమ్మాయి... సినిమాలు చేస్తున్న అమ్మాయి కానీ ఆ మాత్రం ఫాంటసీ ఉంటుందని గ్రహించిన గౌతం కిచ్లు ( Gautam Kitchlu ).. ఆ తర్వాత అందుకు సరేనన్నాడట.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.

మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి

Trending News