Jai Bhim Oscar Youtube: ఆస్కార్ యూట్యూబ్ లో ప్రదర్శించిన తొలి తమిళ చిత్రంగా జై భీమ్ ఘనత

Jai Bhim Oscar Youtube: ప్రముఖ సినీ నటుడు సూర్య న్యాయవాదిగా నటించిన చిత్రం 'జై భీమ్' సినిమా​కు అరుదైన గౌరవం దక్కింది. ఈ చిత్రాన్ని ఆస్కార్​ యూట్యూబ్​ ఛానెల్​ అయిన అకాడమీ అవార్డ్స్​లో ప్రసారం చేస్తున్నారు. అకాడమీ యూట్యూబ్‌ వేదికగా ఒక తమిళ సినిమాకు సంబంధించిన వీడియోను ఉంచటం ఇదే తొలిసారి కావడం విశేషం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 18, 2022, 02:20 PM IST
    • హీరో సూర్య 'జై భీమ్' సినిమాకు అరుదైన ఘనత
    • ఆస్కార్ యూట్యూబ్ ఛానల్ లో స్ట్రీమింగ్ అవుతున్న మూవీ
    • సంతోషాన్ని వ్యక్తం చేసిన 'జై భీమ్' చిత్రబృందం
Jai Bhim Oscar Youtube: ఆస్కార్ యూట్యూబ్ లో ప్రదర్శించిన తొలి తమిళ చిత్రంగా జై భీమ్ ఘనత

Jai Bhim Oscar Youtube: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన కొత్త చిత్రం 'జై భీమ్'. సామాజిక, రాజకీయ అంశాలతో రూపొందిన ఈ సినిమాకు టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. జస్టిస్‌ చంద్రు జీవితకథ ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాను గతేడాది అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయగా.. ఆ చిత్రం విశేషాదరణ పొందింది. ఇప్పుడా సినిమా మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. 

విమర్శకులను సైతం అలరించిన ఈ చిత్రం వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న ఓ కోర్టు డ్రామా కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. అకాడమీ(ఆస్కార్‌) అధికారిక యూట్యూబ్‌ ఛానెల్‌లో ఈ సినిమాకు సంబంధించిన వీడియోను అప్ లోడ్ చేశారు. అకాడమీ యూట్యూబ్‌ వేదికగా ఒక తమిళ సినిమాకు సంబంధించిన వీడియోను ఉంచటం ఇదే తొలిసారి. 

దీంతో 'జై భీమ్' చిత్రబృందంతో పాటు, సూర్య అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 'జై భీమ్‌' ఇండియన్‌ సినిమా స్థాయి మరో మెట్టు ఎక్కించిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

హీరో సూర్య ఇందులో న్యాయవాది పాత్రలో నటించిగా.. రజీషా విజయన్ హీరోయిన్​గా నటిస్తుండగా, ప్రకాశ్​ రాజ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. సూర్య స్వీయ నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ కింద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  

Also Read: Kiara Advani Photos: ప్రియుడితో మాల్దీవులు వెకేషన్ కు వెళ్లిన కియారా అడ్వాణీ?

Also Read: Nidhhi Agerwal Photos: సంప్రదాయ దుస్తుల్లో ఆకర్షిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News