Jr NTR: వార్ 2 రంగం సిద్ధం.. ముంబైలో అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్..

War 2: రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో బాలీవుడ్లో సైతం ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఈ క్రమంలో ఈ హీరో నుంచి రాబోతున్న వార్ 2 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 11, 2024, 05:43 PM IST
Jr NTR: వార్ 2 రంగం సిద్ధం.. ముంబైలో అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్..

Jr NTR War 2: ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ హిందీలో సైతం తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకున్నారు. ప్రస్తుతం నిన్నటి వరకు ఈ హీరో కొరటాల శివ దర్శకత్వంలో రానున్న దేవరా సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా ఈ సంవత్సరం సెప్టెంబర్ లో విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ క్రమంలో తాజాగా తన తదుపరి సినిమా షూటింగ్ సైతం మొదలు పెట్టేసారు ఈ హీరో. ఇప్పటికే బాలీవుడ్లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమాతో డైరెక్ట్ హిందీ డెబ్యూ ఇవ్వనున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ కోసం ఈరోజు ముంబైలో అడుగుపెట్టారు మన బాద్ షా.

హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మెయిన్ లీడ్స్ లో యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ సినిమా రానుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్ సినిమాకు సీక్వెల్ గా వార్ 2 భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. కాగా ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ మొదలై మొదటి షెడ్యూల్ కూడా ముగించుకుంది.

ఇప్పుడు ఈ సినిమా రెండో షెడ్యూల్ మొదలవుతుండగా ఈ షెడ్యూల్లో జూనియర్ ఎన్టీఆర్ పైన కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు మూవీ యూనిట్. ఇందులో భాగంగా ఈ సినిమా షూటింగ్ కోసం ఎన్టీఆర్ ఈరోజు ముంబైకి చేరుకున్నారు. ఆల్రెడీ వార్ 2 షూటింగ్ జరుగుతున్న లొకేషన్ కి వెళ్లినట్టు సమాచారం. ఇక రేపటి నుంచి దాదాపు 8 రోజులు  పాటు ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ లో బిజీగా ఉండనున్నారట. ఆ తర్వాత మళ్ళీ దేవర షూట్ లోకి రానున్నట్టు తెలుస్తుంది. మొత్తం పైన ఈ రెండు సినిమాల కోసం ఒకేసారి అటూ ఇటూ గా కష్టపడినన్నారు ఈ హీరో.

ఈ క్రమంలో ఎన్టీఆర్ ముంబైలో దిగిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియోలో జూనియర్ ఎన్టీఆర్ ఎంతో స్టైలిష్ గా కనిపిస్తూ ఈ చిత్రంపై మరిన్ని అంచనాలను పెంచేశాడు.

 

Also Read: KCR Ugadi Panchangam: కేసీఆర్‌కు మళ్లీ గెలుపు అవకాశాలు.. కేటీఆర్‌కు కొంత కష్టమే.. ఉగాది పంచాంగం ఇలా..

Also Read: Lok Sabha Polls: ఎంపీ ఎన్నికలకు రేవంత్‌ రెడ్డి భారీ వ్యూహం.. అలా నామినేషన్‌.. ఇలా ప్రచారం

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News