రజనీకాంత్ సినిమా "కాలా" రిలీజ్ డేట్ ఖరారు

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న "కాలా" చిత్రం రిలీజ్ తేదీ ఎట్టకేలకు ఖరారు అయ్యింది.

Updated: Feb 10, 2018, 08:42 PM IST
రజనీకాంత్ సినిమా "కాలా" రిలీజ్ డేట్ ఖరారు

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న "కాలా" చిత్రం రిలీజ్ తేదీ ఎట్టకేలకు ఖరారు అయ్యింది. ఏప్రిల్ 27వ తేదిన ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ఈ సినిమా నిర్మాతలు ఈ రోజు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. "కబాలి" చిత్రానికి దర్శకత్వం వహించిన పా రంజిత్ మళ్లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం గమనార్హం. వండర్ బార్ ఫిలిమ్స్ బ్యానరుపై రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు.

అంజలి పాటిల్, హ్యుమా ఖురేషి, నానా పటేకర్, సముద్రఖని, సుకన్య, ఈశ్వరి రావు, షాయాజీ షిండే, సంపత్ రాజ్, రవి కాలే ఈ చిత్రంలో ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందివ్వగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రం తాలూకు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దక్కించుకుంది.  తిరునల్వేలి ప్రాంతం నుండి ముంబయి వెళ్లిపోయిన ఓ డాన్ కథ "కాలా" అని గతంలో ఈ చిత్ర దర్శకుడు ప్రకటించారు.