ఆ బంపర్ ఆఫర్ నిజమేనన్న కాజల్ అగర్వాల్‌

బంపర్ ఆఫర్ గురించి వెల్లడించిన కాజల్ అగర్వాల్ 

Last Updated : Dec 3, 2018, 06:20 PM IST
ఆ బంపర్ ఆఫర్ నిజమేనన్న కాజల్ అగర్వాల్‌

ఇటీవలే కవచం మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్న కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఓ సినిమా, శర్వానంద్‌తో గ్యాంగ్‌స్టర్ అని మరో మూవీ చేస్తోంది. ఇవే కాకుండా కాజల్‌కు శంకర్ డైరెక్ట్ చేయనున్న భారతీయుడు 2 సినిమాలోనూ అవకాశం వచ్చినట్టు మనం ఇటీవలే చెప్పుకున్నాం. కానీ ఇదివరకు దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే, తాజాగా కవచం సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా వున్న కాజల్ అగర్వాల్.. భారతీయుడు ప్రాజెక్ట్ గురించి పెదవి విప్పినట్టు తెలుస్తోంది. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. తాను భారతీయుడు సీక్వెల్ చేస్తున్న మాట నిజమేనని అంగీకరించినట్టు సమాచారం. 

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మొదలు తెలుగు, తమిళ భాషల్లో దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన కాజల్ అగర్వాల్ మొదటిసారిగా లోకనాయకుడు, సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్‌ సరసన జంటగా నటించనుంది. కమల్‌తో కలిసి నటించనుండటంపై కాజల్ అగర్వాల్ సైతం భలే ఎగ్జైట్‌మెంట్‌తో ఉందట! అందులోనూ అది శంకర్ లాంటి దిగ్గజ దర్శకుడి సినిమాలో నటించే అవకాశం కావడంతో ఆమె ఆనందానికి ఇక హద్దుల్లేకుండాపోయాయట!

అన్నట్టు భారతీయుడు 2 సినిమాలో కమల్ హాసన్‌తోపాటు మళయాళం నుంచి మరో స్టార్ హీరో కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నట్టు కోలీవుడ్ టాక్.

Trending News