నేను రెడీ అంటున్న Kajal Aggarwal

Kajal Aggarwal movies: పెళ్లి తర్వాత కూడా తాను సినిమాలు చేయదల్చుకుంటున్నానని కాజల్ అగర్వాల్ తన పెళ్లి కంటే ముందే చాలా స్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన బిజినెస్‌మేన్ గౌతం కిచ్లును ( Gautam Kitchlu ) పెళ్లి చేసుకుని మాల్దీవ్స్‌లో హనీమూన్ లైఫ్ ఎంజాయ్ చేసొచ్చి మళ్లీ ఆచార్య సినిమా షూటింగ్‌లో బిజీ అయ్యింది.

Last Updated : Jan 25, 2021, 09:29 PM IST
నేను రెడీ అంటున్న Kajal Aggarwal

Kajal Aggarwal movies: పెళ్లి తర్వాత కూడా తాను సినిమాలు చేయదల్చుకుంటున్నానని కాజల్ అగర్వాల్ తన పెళ్లి కంటే ముందే చాలా స్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన బిజినెస్‌మేన్ గౌతం కిచ్లును ( Gautam Kitchlu ) పెళ్లి చేసుకుని మాల్దీవ్స్‌లో హనీమూన్ లైఫ్ ఎంజాయ్ చేసొచ్చి మళ్లీ ఆచార్య సినిమా షూటింగ్‌లో బిజీ అయ్యింది. చిరంజీవి ( Chiranjeevi ) సరసన కాజల్ అగర్వాల్ చేస్తున్న ఆచార్య మూవీ షూటింగ్ కూడా ఓ కొలిక్కి రావడంతో మరిన్ని తెలుగు సినిమాలకు సైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని కాజల్ ఇండైరెక్ట్ సిగ్నల్స్ ఇస్తోందట. 

పెళ్లి తర్వాత సినిమా కెరీర్‌లో ఎక్కువ గ్యాప్ తీసుకుంటే ఆ తర్వాత ఇక సినిమాలు చేద్దామన్నా అవకాశాలు రావనే ఉద్దేశంతో వెంటవెంటనే సినిమాలకు సైన్ చేయాలని కాజల్ అగర్వాల్ తాపత్రయపడుతున్నప్పటికీ.. టాలీవుడ్ నిర్మాతలు మాత్రం ఆమెతో సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదట. సీనియర్ హీరోయిన్స్‌తో సినిమాలు చేయాల్సిన అవసరం వస్తే.. సమంత లేదా నయనతార ( Samantha Akkineni, Nayanthara ) వైపు చూస్తున్నారు కాని కాజల్ అగర్వాల్ వైపు చూడటం లేదనే టాక్ బలంగా వినిపిస్తోంది. 

Also read : హీరోయిన్ Jayashree Ramaiah suicide కి అసలు కారణం ?

ప్రస్తుతం కాజల్ అగర్వాల్ అప్‌కమింగ్ మూవీస్‌లో ఆచార్య  ( Acharya ), ఇండియన్ 2 ( Indian 2 ) చిత్రాలు ఉన్నాయి. ఈ రెండు ప్రాజెక్ట్స్ నుండి తాను ఫ్రీ అయ్యేలోపే మరో సినిమాకు సైన్ చేయకపోతే ఇక కెరీర్ కష్టమే అనే టెన్షన్ కాజల్ అగర్వాల్‌ని వేధిస్తోందనేది టాలీవుడ్ టాక్. కాజల్ అగర్వాల్‌కి పెళ్లి ( Kajal Aggarwal's marriage ) తర్వాత కొన్ని సినిమాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయనే టాక్ కూడా వినిపిస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News