వైభవంగా సాగుతున్న 'కళ్యాణ వైభోగమే'

కళ్యాణ వైభోగమే సీరియల్‌లో ద్విపాత్రాభినయంతో ఆకట్టుకుంటున్న మేఘన లోకేష్

Last Updated : Jul 19, 2018, 06:06 PM IST
వైభవంగా సాగుతున్న 'కళ్యాణ వైభోగమే'

కళ్యాణ వైభోగమే సీరియల్‌లో మేఘన లోకేష్ ద్విపాత్రాభినయంతో ఆకట్టుకుంటోంది. ఒక పాత్రలో పేదింటి పల్లెటూరి పడుచుగా సాదాసీదాగా కనిపిస్తుంది. మరో పాత్రలో డబ్బుతో ఏదైనా కొనేయగలమనే భ్రమలో బతుకుతూ, డబ్బుకే అధిక ప్రాధాన్యత ఇచ్చే యువతిగా దర్శనం ఇస్తుంది. ఈ సీరియల్‌లో సన్నీ ( సూర్య దేవర జయ సూర్య) హీరోగా నటిస్తున్నారు. సూర్య దేవర జయసూర్య మంచి మనసున్న పల్లెటూరి అమ్మాయికి సొంతమవుతాడా లేక పొగరుతో ప్రవర్తించే నిత్యకు సొంతమవుతాడా అనేదే ఈ కల్యాణ వైభోగమే కథాంశం. 

ఈ తెలుగు సీరియల్ ఎపిసోడ్స్‌ను జీ5 వెబ్‌సైట్ ద్వారా ఏ రోజుకు ఆరోజు వీక్షించే అవకాశాన్ని జీ తెలుగు అభిమానుల చెంతకు తీసుకొస్తోంది జీ మీడియా గ్రూప్. టీవీలో చూడలేకపోయిన సీరియల్స్‌ని ఇకపై మీరు జీ5 ద్వారా చూసేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే జీ5లోకి లాగాన్ అవ్వండి. మీకు నచ్చిన సీరియల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోలను ఎంజాయ్ చేయండి.  

Trending News