Karthika Deepam 2 Today December 27 Episode: ఈలోగా జ్యోత్స్నతాత సాయంతో రెస్టారెంట్ హెడ్‌కు కాల్ చేయిస్తుంది. దీంతో సీఈఓ పోస్ట్‌కు వేరేవారిని అపాయింట్ చేశారట. ఇకమీరు బయలు దేరండి సార్ అంటాడు. ప్లీజ్ సార్ వెళ్లండి అంటాడు. దీంతో కార్తీక్ కోసం బయటే వెయిట్ చేస్తుంటుంది జ్యోత్స్న. ఇది కాకుంటే ఇంకోటి అని వెళ్తాడు. నువ్వు ఎక్కడికీ వెళ్లినా ఈ జ్యో నిన్ను ఫాలో అవుతూనే ఉంటా అంటుంది. వెళ్లిన ప్రతి జాబ్ వద్ద మొదట ఓకే చెబుతారు. కాల్ వచ్చిన వెంటనే నో చెబుతారు. సారీ బావ ఈ నువ్వు నా దారికి వచ్చే వరకు ఈ వైకుంఠపాళి ఆడుతూనే ఉంటా అని కార్లో నుంచి చూస్తూ సంబపరపడుతుంది.
ఇక ఇంటి వద్ద శౌర్య ఇంటికి ఎప్పుడు వెళతాం అని ప్రశ్నలు వేస్తుంది. ఏంటమ్మ ఇలా జరిగింది? మనం ఊళ్లో ఉండేవాళ్లం మళ్లీ ఏ ఇంటికి వెళతామోఅంటుంది. అప్పుడే కార్తీక్ ఇంటి దారిపడతాడు. హాయ్ నాన్న.. నువ్వు స్వీట్స్ తెస్తావని నానమ్మ చెబుతుంది. చాక్లెట్ ఏంది అంటుంది శౌర్య. సారీ అమ్మ కుదర్లేదు కాసేపయ్యాక తీసుకువస్తా అంటాడు. కార్తీక్ లోపలికి వెళ్తాడు కూడా దీప వెళ్తుంది. కార్తీక్ బాబు. నీకు జాబ్ రాకపోవడం ఏంటి? అంటుంది. ఏమైందో నాకు తెలియదు జాబ్ ఉందన్నారు, ఫైల్ నింపమన్నారు. అందరూ ఓకే చేయడం ఆతర్వాత రిజెక్ట్ చేయడం నేను ఎక్కడకు వెళ్లానో ఎవరికి తెలుసు. ఇక ట్రై చేయడానికి ఏం లేదు అంటాడు. అదుకాకుండే వేరేది అంటుంది దీప. రండి బాబు.. భోజనం చేద్దురు అంటుంది. కాసేపు వదిలేయ్ దీప అంటాడు. దీపకు జ్యోత్స్నపై అనుమానం కలుగుతుంది.
మరుసటి రోజు కార్తీక్ కాంచన ఫోన్‌లో సిమ్ వేసుకుంటాడు. అప్పుడే కార్తీక్‌కు కాఫీ తీసుకువస్తుంది దీప. ఈరోజుల్లో చేతుల్లో ఫోన్ లేకుంటే ఈ ప్రపంచానికి దూరం అయినట్లే. ఉద్యోగ ప్రయత్నాలు ఆపినా, వేరే ప్రయత్నాలు ఆపకూడదు కదా అంటాడు. అప్పుడే కార్తీక్‌కు కాల్ వస్తుంది. జాబ్ ఇస్తాను రండి అని ఫోన్ వస్తుంది. అడ్రస్ పంపిస్తారు. ఎవరో మీ గురించి తెలుసుకుని జాబ్ ఇస్తామంటున్నారు. వెంటనే వెళ్లండి బాబుగారు అంటుంది దీప. ఫోన్ చేసి మరీ పిలుస్తున్నారు నాకు డౌట్‌గా ఉంది దీప అంటాడు కార్తీక్. కాంచన, దీపలు కార్తీక్‌ను ఒప్పిస్తారు. సరే అని రెడీ అయి వెళ్తాడు. దేవుడా.. కార్తీక్ బాబుకు ఈ ఉద్యోగం వచ్చేలా చూడు అని మొక్కుతుంది దీప
రెస్టారెంట్‌కు వస్తాడు. నా గురించి ఎలా తెలుసు అంటాడు. హలో సార్ అంటాడు. నాకు ఫోన చేసి రమ్మన్నారు మిమ్మల్ని చూస్తే గుర్తుపడతా అంటాడు. అక్కడ ఉన్నది కార్తీక్ తండ్రే.. దీంతో అబద్దం చెప్పి ఎక్కడెక్కడ తిరగడం ఎందుకు? అంటాడు. ఫ్యామిలీని ఎలా పోషిస్తావు. చేతిలో ఉద్యోగం లేదు, నిన్న నమ్ముకుని నీవెనకాల నలుగురు ఉన్నారు. ఉద్యోగం లేకపోతే ఎలా.. రోజుకో గుడికి లేదా సత్రం దగ్గరకు తీసుకువెళ్తావా? అంటాడు. నువ్వు పైకి ఇలా నటిస్తావు, కానీ లోపల హ్యాపీగా ఉంటావు, రీవేంజ్ తీర్చుకోవడానికి నీకో అవకాశం వచ్చింది. పెద్దమనిషిలా నీ ఈగోను సమర్థించుకోవడానికి ఇదంతా చేస్తున్నావ్ అని వెళ్లిపోతాడు కార్తీక్.
ఇదీ చదవండి: రెండు రోజులుగా చిరుజల్లులు.. 21 మి మీటర్ల వర్షపాతం, నేటి నుంచి మార్పు..
నువ్వు మళ్లీ తిరిగి ఇక్కడికే వస్తావు, చేతనైతే 24 గంటల్లో జాబ్ సంపాదించి చూడురా అంటాడు, గంటో చేసి చూపిస్తా అంటాడు. మరోవైపు దీప ఓ ఇంట్లో పని మాట్లాడుకుంటుంది. ఏరోజు కూలి ఆ రోజు ఇవ్వమని అడుగుతుంది. సర్లే కానీ, అంటుంది. అదిగో వంటగది సాంబార్ పెట్టు, ఒక్కకర్రీ చేయి అప్పుడు నేను డిసైడ్ చేస్తాను నీకు ఎంత డబ్బు ఇవ్వాలి అని అంటుంది ఓనర్. ఇక చకచకా దీప కూరగాయలు కట్‌చేసి వంటచేస్తుంది. కార్తీక్ బాబుకు గుడికి వెళ్తున్న అని చెప్పి వచ్చా అని అనుకుంటుంది. అప్పుడే సరుకులు వచ్చాయి వెళ్లి డోర్ తీయమని చెబుతుంది ఓనర్, దీప వెళ్లి డోర్ తీస్తుంది. ఆ డెలివరీ బాయ్ ఎవరో కాదు కార్తీక్. ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది దీప. కార్తీక్ కూడా దీపను చూసి ఆశ్చర్యపోతాడు.
దీప ఈ సరుకుల లిస్ట్ చూసి అన్ని వచ్చాయా? చూడు అంటుంది. ఈ సరుకులు ఒక్కక్కటీ చెబుతా వచ్చాయో లేదో చూడు అని కార్తీక్ అన్ని సామాన్లు లెక్కపెడుతుంటాడు. అప్పుడు ఓనర్ తిరుమలరావు గారి సూపర్ మార్కెట్లో నిన్ను ఎప్పుడూ చూడలేదు అంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.