Nidhi Aggarwal: మొన్న నయనతార, త్రిష..ఇప్పుడు నిధి అగర్వాల్..త్వరలో పెళ్లి కూడా అట

Nidhi Aggarwal: ఉత్తరాది నుంచి దక్షిణాదికి పరిచయమైన హాట్‌బ్యూటీ నిధి అగర్వాల్. త్వరలో పెళ్లిచేసుకోనుందనే వార్తలు విన్పిస్తున్నాయి. ఇప్పటికే చాలామందితో ఎఫైర్ నడిపిన ఆ హీరోతో నిధి లిలేషన్ కొనసాగిస్తుండటం విశేషం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 8, 2022, 09:13 AM IST
Nidhi Aggarwal: మొన్న నయనతార, త్రిష..ఇప్పుడు నిధి అగర్వాల్..త్వరలో పెళ్లి కూడా అట

Nidhi Aggarwal: ఉత్తరాది నుంచి దక్షిణాదికి పరిచయమైన హాట్‌బ్యూటీ నిధి అగర్వాల్. త్వరలో పెళ్లిచేసుకోనుందనే వార్తలు విన్పిస్తున్నాయి. ఇప్పటికే చాలామందితో ఎఫైర్ నడిపిన ఆ హీరోతో నిధి లిలేషన్ కొనసాగిస్తుండటం విశేషం.

నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హాట్‌బ్యూటీ నిధి అగర్వాల్. ఆ తరువాత నాగ చైతన్య తమ్ముడు అఖిల్‌తో మజ్ను సినిమాతో రాణించింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ విజయాన్ని దక్కించుకుంది. హిట్ మూవీ ఒక్కటే అయినా నిధి అగర్వాల్‌కు ఆఫర్లు బాగానే వస్తున్నాయి. ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో కలిసి హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తోంది. 

టాలీవుడ్‌లో సినిమాలతో బిజీ అయితే.. కోలీవుడ్‌లో ప్రేమాయణంలో మునిగిపోయింది. చాలామంది అంటే నయనతార, త్రిష, హన్సిక వంటి నటీమణులతో రిలేషన్ సాగించిన కోలీవుడ్ నటుడు శింభుతో (Simbhu)నిధి డేటింగ్‌లో ఉందని తెలుస్తోంది. శింభుకి ఇండస్ట్రీలో ఉన్న లవ్ స్టోరీస్, బ్రేకప్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొత్తగా నిధి అగర్వాల్‌తో (Nidhi Aggarwal) రిలేషన్ కొనసాగిస్తున్నట్టు సమాచారం. ఈ ఇద్దరూ కలిసి ఇప్పటికే ఈశ్వరన్ సినిమాలో నటించారు. అప్పట్నించే ఈ ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారిందనేది కోలీవుడ్ వార్త. చెన్నైలోని ఓ ఇంట్లో ఇద్దరూ కలిసి ఉంటున్నారని..త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని సమాచారం. ఈ వార్త ఇప్పుడు హాట్ హాట్‌గా మారింది. వైరల్ అవుతోంది. అయితే ఎంతవరకూ నిజమో తెలియదు. ఎందుకంటే ఇప్పటి వరకూ ఏ ఒక్కరు కూడా ఈ విషయంపై ఎటువంటి ప్రకటన చేయలేదు. 

Also read: Sathyaraj Hospitalised: కరోనాతో ఆసుపత్రిలో బాహుబలి కట్టప్ప.. సీరియస్ కండిషన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News