Joruga Hushaaruga Shikaaru Podhama: ఫుల్‌ జోష్‌లో సంతోష్ శోభన్.. ‘జోరుగా హుషారుగా షికారు పోదమ’ అంటూ సందడి

Santosh Sobhan Next Movie: ‘జోరుగా హుషారుగా షికారు పోదమ’ మూవీ నుంచి ‘ప్రేమ..’ అనే మెలోడీ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. సంతోష్ శోభన్, ఫల్గుణి ఖన్నా జంటగా నటిస్తున్న ఈ సినిమాకు సుభాష్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 4, 2024, 01:18 AM IST
Joruga Hushaaruga Shikaaru Podhama: ఫుల్‌ జోష్‌లో సంతోష్ శోభన్.. ‘జోరుగా హుషారుగా షికారు పోదమ’ అంటూ సందడి

Santosh Sobhan Next Movie: యంగ్ హీరో సంతోష్ శోభన్ ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టాడు. ‘జోరుగా హుషారుగా షికారు పోదమ’ మూవీతో ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమయ్యాడు. స్టోరీ క్యాట్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్.ఒరిజినల్స్ అసోసియేషన్ విత్ ఎం.ఆర్.ప్రొడక్షన్స్ ఈ మూవీ నిర్మిస్తున్నాయి. సుభాష్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. ప్రవీణ్ నంబారు, సృజన్ ఎరబోలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సంతోష్ శోభన్‌కు జంటగా ఫల్గుణి ఖన్నా హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది. రీసెంట్‌గా ఈ మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్, సాంగ్స్ రిలీజ్ చేయగా.. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘ప్రేమ..’ అనే మెలోడీ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. 

నాగవంశీ అదిరిపోయే మ్యూజిక్ అందించారు. క్లాసికల్ టచ్‌తో సాగే ఈ సాంగ్ ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్‌లో హీరోయిన్ ఫల్గుణి ఖన్నా తన మనసులో సంతోష్ శోభన్‌పై ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తుంది. హీరోయిన్ మనసులో ప్రేమ ఎలా పుట్టిందనే విషయాన్ని వివరిస్తూ.. సాంగ్‌ను చక్కగా తీర్చిదిద్దారు. హరిణి ఇవటూరి చక్కటి గాత్రం అందించగా.. దినేష్ కక్కెర్ల చక్కగా పాట రాశారు. సాంగ్‌లోని రాజస్థానీ లిరిక్స్‌ను రాజేష్ కొలర్జ చక్కగా సమకూర్చారు. లిరికల్ వీడియోలో కేవలం సాంగ్ మాత్రమే కాకుండా మధ్యలో గ్లింప్స్, మ్యూజిక్ మేకింగ్ ప్రాసెస్‌ను కూడా మేకర్స్ చూపించారు. ప్రేమ, భావోద్వేగాలను చక్కగా ఎలివేట్ చూపించిన ఈ పాట అందరినీ మెప్పిస్తోంది. త్వరలోనే ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

==> యాక్టర్స్: సంతోష్ శోభన్, ఫల్గుణి ఖన్నా తదితరులు
==> బ్యానర్స్ - స్టోరీ క్యాట్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్.ఒరిజినల్స్ అసోసియేషన్, ఎం.ఆర్.ప్రొడక్షన్స్
==> ప్రొడ్యూసర్స్ - ప్రవీణ్ నంబారు, సృజన్ ఎరబోలు 
==> రైటింగ్, డైరెక్షన్‌- సుభాష్ చంద్ర
==> ఎగ్జిక్యూటివ్ నిర్మాత - రోహిత్ కృష్ణ వర్మ
==> సినిమాటోగ్రఫీ - సాయి సంతోష్
==> సంగీతం - నాగ వంశీ
==> ఎడిటర్ - అనీల్ కుమార్.పి
==> సౌండ్ డిజైనర్ - నాగార్జున తాళ్లపల్లి
==> PRO - వంశీ కాకా

Also Read: Poco M6 5G Price: న్యూ ఇయర్‌ ప్రత్యేక డీల్..Poco M6 5G ఇప్పుడు కేవలం రూ.699కే..పూర్తి వివరాలు ఇవే!

Also Read: Oneplus Buds 3 Price: వన్‌ప్లస్‌ లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌..చీప్‌గా మార్కెట్‌లోకి OnePlus బడ్స్‌ 3..ధర, ఫీచర్స్‌ వివరాలు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News