Mallidi Vassishta: కొంత మంది సినిమాలపై అభిమానంపై దర్శకులుగా మారిన వాళ్లలో వశిష్ట ఒకరు. బింబిసారతో దర్శకుడుగా మారిన మల్లిడి వశిష్ట .. 8 జనవరి 1986లో జన్మించారు. వశిష్ట అసలు పేరు మల్లిడి వేణు. అంతేకాదు వాళ్ల ఫ్యామిలీ కూడా సినిమా ఇండస్ట్రీకి చెందినది కావడం విశేషం. వాళ్ల తండ్రి మల్లిడి సత్యనారాయణ రెడ్డి నిర్మాతగా ‘బన్నీ, ‘భగీరథ’, ‘ఢీ’ వంటి చిత్రాలను నిర్మించారు. అలా చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి ఏర్పడింది.
ఆ ఇంట్రెస్ట్ తోనే హీరోగా 'ప్రేమలేఖ రాశా' అనే సినిమా చేశారు. ఆ మూవీ వశిష్టకు మంచి ఎక్స్ పీరియన్స్ అని చెప్పాలి. తొలి సినిమా తర్వాత నటుడిగా కాకుండా తన దర్శకుడిగా తన రూట్ మార్చుకున్నారు. అసలు ఫస్ట్ మూవీ తర్వాత ఆయన స్క్రీన్ మీద కనిపించకపోవడంతో సినీ పరిశ్రమకు దూరం అయిపోయారేమో అనుకున్నారు అంతా. కానీ సినీ పరిశ్రమ పై మక్కువతో కొంత కాలం రీసెర్చ్ చేసి 'బింబిసార' అనే స్టోరీ సిద్ధం చేసుకున్నారు. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కి ఆ కథ చెప్పి ఒప్పించారు. అంతేకాదు తనదైన శైలిలో డైరెక్ట్ చేసి చాలా కాలం నుంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్ కి ఒక బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించారు.
‘బింబిసార’తో ఒక్కసారిగా తెలుగు సినీ పరిశ్రమతో పాటు ప్యాన్ ఇండియాలో అన్ని చిత్ర పరిశ్రమల దృష్టిని ఆకర్షించారు. తొలి సినిమా తర్వాత వశిష్ట ఎవరితో సినిమా చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూసారు. ఈ టైమ్ లోనే మెగాస్టార్ చిరంజీవితో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసాడు. సాధారణంగా మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరోని అప్రోచ్ అవ్వడమే చాలా కష్టం. అలాంటిది ఏకంగా రెండో సినిమాని చిరుతో చేసే ఛాన్స్ దక్కించుకోవడం అంటే ఆషామాషీ కాదు. అందులో విజయం సాధించారు దర్శకుడు వశిష్ట.
మెగాస్టార్ చిరంజీవితో 'విశ్వంభర' అనే సినిమా మొదలుపెట్టి ఒక సోషియో ఫాంటసీ త్రిల్లర్ గా ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు. సంక్రాంతికి రావలసిన ఆ సినిమా కొన్ని కారణాలతో వాయిదా పడింది. ఈ సినిమా మే 9న విడుదల చేయాలనే ప్లాన్ చేస్తున్నాడు. బింబిసార సినిమాతోనే టాలీవుడ్ లో తనదైన మార్క్ వేసుకున్న ఆయన రెండో సినిమాతో మరిన్ని రికార్డులు సృష్టించడం పక్కా చెబుతున్నారు. ఇటీవలె తండ్రిగా ప్రమోషన్ పొందిన వశిష్ట ‘విశ్వంభర’ తర్వాత మరో స్టార్ హీరోతో ప్రాజెక్టు పట్టాలెక్కించబోతున్నారు. దానికి సంబంధించిన విషయాలను త్వరలో తెలియజేయనున్నారు.
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.