Miss Shetty MR Polishetty: 'మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి' మూవీపై చిరంజీవి రివ్యూ.. జాతిరత్నాలకు మించి కామెడీ

Chiranjeevi Review on Miss Shetty MR Polishetty: మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ టీమ్‌ను అభినందించారు మెగాస్టార్ చిరంజీవి. ప్రత్యేకంగా షో చూసిన చిరంజీవి.. జాతిరత్నాలకు మించి వినోదం ఉందంటూ రివ్యూ ఇచ్చారు. మూవీ విడుదలకు ముందు మెగా అభినందనలు లభించడంతో పెద్ద బూస్ట్ వచ్చింది.   

Written by - Ashok Krindinti | Last Updated : Sep 5, 2023, 03:47 PM IST
Miss Shetty MR Polishetty: 'మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి' మూవీపై చిరంజీవి రివ్యూ.. జాతిరత్నాలకు మించి కామెడీ

Chiranjeevi Review on Miss Shetty MR Polishetty: అనుష్క శెట్టి (Anushka Shetty), నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) కీలక పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' (Miss Shetty MR Polishetty). సెప్టెంబర్ 7న తెలుగుతోపాటు తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో ఆడియన్స్ ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు, ట్రైలర్లు మూవీపై అంచనాలను పెంచేశాయి. చాలా రోజుల తరువాత అనుష్క స్క్రీన్‌పై కనిపిస్తుండడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం రిలీజ్‌కు ముందు పెద్ద బూస్ట్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తాజాగా మూవీని చూసి అదిరిపోయే రివ్యూ ఇచ్చారు. 

'మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి' సినిమాను చూశానని.. మొదటి నుంచి చివరి దాకా ఎంతగానో ఆకట్టుకున్న హిలేరియస్ ఎంటర్టైనర్ అని తెలిపారు మెగాస్టార్. నేటి యువత  ఆలోచనా విధానాన్ని రిఫ్లెక్ట్  చేస్తూ తీసుకున్న సరికొత్త  కథాంశం అని ప్రశసించారు. 'జాతిరత్నాలు'కి రెట్టింపు ఎనర్జీని.. వినోదాన్ని  అందజేసిన నవీన్ పోలిశెట్టి, కొంచెం గ్యాప్ తర్వాత కనిపిస్తున్నా మరింత అందంగా, బ్యూటీఫుల్‌గా ఉన్న మనందరి  'దేవసేన' అనూష్క శెట్టిలు ఈ చిత్రానికి  ప్రాణం పోశారని అభినందించారు. ఫుల్ లెంగ్త్  ఎంటర్‌టైనర్ అవటంతో పాటు ఎమోషన్స్‌ని కూడా అద్భుతంగా మిక్స్  చేసి రక్తి కట్టించేలా రూపుదిద్దిన  డైరెక్టర్ మహేష్‌ బాబును అభినందించాల్సిందేనని చిరంజీవి అన్నారు. 

ఈ మూవీకి  తొలి ప్రేక్షకుడిని తానేనని.. ఆ  హిలేరియస్ మూమెంట్స్  ఎంతగానో ఎంజాయ్  చేశానని మెగాస్టార్ ట్వీట్ చేశారు. మరోసారి థియేటర్‌లో ఆడియన్స్‌తోనూ ఎంజాయ్ చేయాలన్న బలమైన  కోరిక తనకు కలిగిందని చెప్పుకొచ్చారు. మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి వంద శాతం ఆడియన్స్‌ను నవ్వుల బాట  పట్టిస్తారనటంలో సందేహం లేదని అన్నారు. నవీన్ పొలిశెట్టి, మూవీ టీమ్‌తో దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్ చేశారు. మూవీ టీమ్ అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ కోసం 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీని సోమవారం ప్రత్యేకంగా ప్రదర్శించారు. హీరో నవీన్ పోలిశెట్టి, డైరెక్టర్ మహేష్ బాబును ఇంటికి పిలిపించుకుని ప్రత్యేకంగా అభినందించడం విశేషం.

Also Read: India World Cup 2023 Squad: సస్పెన్స్ వీడింది.. ప్రపంచ కప్‌కు భారత జట్టు ప్రకటన

Also Read: Minister KTR: రూ.700 కోట్లతో తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News