Naga Chaitanya Crush: ఆ హీరోయిన్ అంటే నాకు చాలా ఇష్టం.. కత్రినా, ప్రియాంకతో ఒక్కసారైనా..: నాగ చైతన్య

Naga Chaitanya Reveals his First Celebrity Crush. ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ చైతన్య తన ఫస్ట్‌ సెలబ్రిటీ క్రష్‌ ఎవరో చెప్పారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 17, 2022, 12:44 PM IST
  • ఆ హీరోయిన్ అంటే నాకు చాలా ఇష్టం
  • కత్రినా, ప్రియాంకతో ఒక్కసారైనా
  • అందమైన మహిళతో సమయాన్ని గడపాలనుకుంటా
Naga Chaitanya Crush: ఆ హీరోయిన్ అంటే నాకు చాలా ఇష్టం.. కత్రినా, ప్రియాంకతో ఒక్కసారైనా..: నాగ చైతన్య

Naga Chaitanya says My First Celebrity Crush is Sushmita Sen: అమీర్ ఖాన్ నటించిన 'లాల్ సింగ్ చద్దా' సినిమాతో టాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆగస్ట్‌ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే సినిమాలో చై పాత్రకు మాత్రం మంచి స్పందన వస్తోంది. లాల్ సింగ్ చద్దా మూవీ రిలీజ్‌కు ముందు నుంచే నాగ చైతన్య వరుస ఇంటర్య్వూలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విడాకులు, మాజీ భార్య, వ్యక్తిగత విషయాలపై చై తన అభిప్రాయాలు పంచుకున్నారు. 

ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ చైతన్య తన ఫస్ట్‌ సెలబ్రిటీ క్రష్‌ ఎవరో చెప్పారు. 'నా ఫస్ట్‌ సెలబ్రిటీ క్రష్‌ సుస్మితా సేన్‌. ఆమె అంటే నాకు చాలా ఇష్టం. ఈ విషయాన్ని సుస్మితాకు కూడా చెప్పాను' అని చై తెలిపారు. ఏ నటీమణితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవాలనుకుంటున్నారు అని ప్రశ్నించగా.. 'ఆలియా భట్‌ని అభిమానిస్తా. ప్రతి సినిమాలో ఆలియా తన నటనతో అదరగొడుతున్నారు. కత్రినా కైఫ్‌ చాలా అందంగా ఉంటారు. కాట్ బాగా నటిస్తారు. ప్రియాంక చోప్రా కెరీర్‌ని స్ఫూర్తిగా తీసుకుంటా. అవకాశం వస్తే ఈ ముగ్గురితో నటిస్తా' అని నాగ చైతన్య బదులిచ్చారు.

'మనం' సినిమా హిందీలో రీమేక్‌ అయితే తన పాత్ర ఎవరు చేస్తే బాటుందని నాగ చైతన్య అడగ్గా.. రణ్‌బీర్ కపూర్ అని సమాధానం ఇచ్చారు. మీరు ఒక ఐలాండ్‌లో చిక్కుకుపోతే ఆసమయంలో మీతో ఏం ఉండాలని కోరుకుంటారు? అని ప్రశ్నించగా.. 'ఐలాండ్‌లో చిక్కుకుపోతే నాకెంతో ఇష్టమైన మ్యూజిక్‌ నాతోనే ఉండాలనుకుంటా. నా మనసుకు దగ్గరైన ఓ అందమైన మహిళతో సమయాన్ని గడపాలనుకుంటా' అని నాగ చైతన్య చెప్పుకొచ్చారు. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన  'లాల్ సింగ్ చద్దా' సినిమాలో చై బాలరాజుగా నటించారు. హాలీవుడ్‌ చిత్రం ‘ఫారెస్ట్‌ గంప్‌’ ఆధారంగా వచ్చిన ఈ సినిమాలో కరీనా కపూర్‌ కథానాయిక. 

Also Read: ZIM vs IND: వైరల్ వీడియో.. రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు బిక్క మొహం వేసిన శిఖర్ ధావన్!

Also Read: Milk for weight Gain: బరువు పెరగడానికి సులుభమైన చిట్కాలు ఇవే.. ఇవి పాటిస్తే చాలా.!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News