Akhil Agent : నాగ చైతన్య కంటే దారుణంగా అఖిల్.. ఇక సమంత అయితే అంతకు మించి

Akhil Agent Disaster అఖిల్ ఏజెంట్ సినిమా ఇప్పుడు అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా కనీసం పది కోట్ల షేర్ కూడా రాబట్టలేకపోయింది. సింగిల్ డిజిట్‌కే పరిమితం అయింది. నాగ చైతన్య థాంక్యూ సైతం ఇలానే బాక్సాఫీస్ వద్ద బెడిసి కొట్టేసింది. ఇక సమంత శాకుంతలం సైతం ఇలానే డిజాస్టర్ అయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 2, 2023, 11:29 AM IST
  • అక్కినేని వారికి డిజాస్టర్లు
  • చైతూ, అఖిల్‌కు ఎదురుదెబ్బలు
  • సమంతకు సైతం పెద్ద షాక్
Akhil Agent : నాగ చైతన్య కంటే దారుణంగా అఖిల్.. ఇక సమంత అయితే అంతకు మించి

Akhil Agent Disaster ప్రస్తుతం సినిమాల పరిస్థితి దారుణంగా మారింది. సినిమా మొదటి రోజే దాని భవిష్యత్తు ఏంటో అర్థం అవుతోంది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చి, మంచి రివ్యూలు, మౌత్ టాక్ వస్తే.. వెంటనే టికెట్లు బుక్ అవుతున్నాయి.. హౌస్ ఫుల్ అవుతున్నాయి.. వీకెండ్‌లో కలెక్షన్లు పెరుగుతున్నాయి.. అదే కాస్త తేడా కొడితే.. మిక్స్డ్, డివైడ్ టాక్.. డిజాస్టర్ టాక్ వస్తే మాత్రం థియేటర్ సైడ్ కూడా ఎవ్వరూ పోవడం లేదు. దీంతో సినిమా భారీ డిజాస్టర్లుగా నిలుస్తున్నాయి.

ఇదే విషయం నాగ చైతన్య థాంక్యూ విషయంలోనూ జరిగింది. విపరీతమైన అంచనాలతో ఈ సినిమా వచ్చింది. విక్రమ్ కే కుమార్, నాగ చైతన్య, దిల్ రాజుల మీదున్న నమ్మకంతో ఫస్ట్ డే ఫస్ట్ షో బాగానే హౌస్ ఫుల్ అయింది. అయితే సినిమాను చూసిన తరువాత వచ్చిన మౌత్ టాక్, రివ్యూలతో సినిమా చచ్చిపోయింది. ఇదేం సినిమా అని అంతా అనుకున్నారు. దీంతో మొదటి రోజుకే షెడ్డుకు వెళ్లినట్టు అయింది. అలా థాంక్యూ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్‌ అయింది.

ఈ మధ్య శాకుంతలం ఎక్కువగా హాట్ టాపిక్ అయింది. పాన్ ఇండియా అంటూ సమంత హడావిడి చేసింది. అమె కంటే ఎక్కువగా దిల్ రాజు హంగామా చేశాడు. ఇక గుణ శేఖర్ అయితే బాలీవుడ్ అడ్డాలో మన హీరోల గురించి కాస్త తక్కువ చేసి మాట్లాడాడు. చివరకు శాకుంతలం సినిమా మొదటి రోజు మొదటి ఆటకే అటకెక్కేసింది. ఈ సినిమా డబుల్ డిజిట్స్ షేర్‌ను కూడా అందుకోలేకపోయింది. ఈ సినిమాతో ఒక్క దిల్ రాజుకే ఇరవై కోట్లకు పైగా బొక్క పడ్డట్టు తెలుస్తోంది. ఇక గుణ శేఖర్ అయితే నిండా మునిగినట్టు తెలుస్తోంది.

Also Read:  Chaithanya Master Suicide : ఢీ కొరియోగ్రఫర్ మృతి.. ఆ కారణాలతోనే సూసైడ్

నాగ చైతన్య థాంక్యూ సినిమా 22 కోట్ల నష్టాన్ని తెచ్చినట్టు సమాచారాం. ఇక ఏజెంట్ వల్ల కూడా నిర్మాతలు 30 కోట్లకు పైగా నష్టపోయినట్టు తెలుస్తోంది. ఈ రెండు చిత్రాల కంటే ఎక్కువగా శాకుంతలం వల్ల నష్టపోయినట్టు తెలుస్తోంది. దీంతో చైతూ, అఖిల్, సమంతలు డిజాస్టర్ల మీద డిజాస్టర్లు ఇస్తున్నట్టు అయింది.

Also Read:  Mallemala Remunerations : ఢీ షోలో చాలీచాలని రెమ్యూనరేషన్‌లు!.. కొరియోగ్రఫర్ మృతితో మల్లెమాలపై మరో మరక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News