Suresh Babu-Samantha : సమంత మహానటి.. నాగ చైతన్య పెద్ద మామ సురేష్ బాబు కామెంట్స్

Suresh Babu Calls Samantha As Mahanati సమంతను మహానటి అనేశారు నిర్మాతలు సురేష్‌ బాబు, అల్లు అరవింద్. ఈ తరంలో మహానటి రేంజ్‌ను అందుకోగలిగిన స్థాయి సమంతకు ఉందని అనేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 3, 2022, 08:18 AM IST
  • అన్‌స్టాపబుల్‌లో సురేష్ బాబు, అల్లు అరవింద్
  • సమంతను మహానటి అనేసిన సురేష్ బాబు
  • సమంతపై దగ్గుబాటి, అక్కినేని సాఫ్ట్ కార్న్
Suresh Babu-Samantha : సమంత మహానటి.. నాగ చైతన్య పెద్ద మామ సురేష్ బాబు కామెంట్స్

Suresh Babu Calls Samantha As Mahanati : సమంత, నాగ చైతన్య మధ్య పెరిగిన దూరం ఫ్యామిలీలను ఎఫెక్ట్ చేసినట్టుగా కనిపించడం లేదు. ఎందుకంటే సమంత కోసం సుమంత్, సుశాంత్, అఖిల్, వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత ఇలా అందరూ ముందుకు వస్తుంటారు. ఆమె పోస్టులకు కామెంట్లు పెడుతుంటారు. ఆమెకు ధైర్యాన్ని ఇస్తుంటారు. అంటే సమంతకు ఇంకా అక్కినేని, దగ్గుబాటి వారితో మంచి సంబంధాలే ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతోంది. ఇక తాజాగా సురేష్ బాబు చేసిన కామెంట్లు చూస్తే అది ఇంకా నిజమని బలంగా తెలుస్తుంది.

తాజాగా సురేష్‌ బాబు, అల్లు అరవింద్ కలిసి బాలయ్య అన్ స్టాపబుల్ షోకు వచ్చారు. అందులో బాలయ్య ఓ ప్రశ్న వేశాడు. ఈ తరం హీరోయిన్లలో మహానటి రేంజ్‌కు వెళ్లగల స్థాయి ఉన్న వారు ఎవరు? అని అడిగాడు. అల్లు అరవింద్, సురేష్‌ బాబు ఇద్దరూ కూడా సమంత పేరు రాశారు. అనుకోకుండా ఇద్దరం ఒకే పేరు రాశామని అల్లు అరవింద్ ఎగ్జైట్ అయ్యాడు. ఇక సురేష్‌ బాబు అయితే సమంతను ఆకాశానికి ఎత్తేశాడు.

 

ఇప్పుడున్న బ్యాచ్‌లో సమంత మాత్రమే మహానటి అవ్వగలదు అని సురేష్‌ బాబు అనేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. మహానటి సమంత అంటూ ఆమె ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఇక ఇప్పుడు సమంత మయోసైటిస్‌తో ఇంటికి మాత్రమే పరిమితమైంది. ఆమె చేయాల్సిన ప్రాజెక్టులన్నీ కూడా ఆగిపోయాయి.

సమంత మయోసైటిస్‌తో బాధపడుతుండటంతో యశదో ప్రమోషన్స్‌ను చేయలేకపోయింది. ఇక ఇప్పుడు ఖుషీ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఆమె నటించిన శాకుంతలం సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇక సమంత ఎప్పుడు మళ్లీ కుదుటపడుతుందో.. సెట్స్ మీదకు వెళ్తుందో ఎవ్వరికీ తెలియడం లేదు.

Also Read : Samantha Ruthprabhu: మా సినిమాలో విలన్ గా నటించమన్న అడివిశేష్.. సమంత మైండ్ బ్లాకింగ్ రిప్లై!!

Also Read : Sai Dharam Tej Sweet Reply : ఎంతైనా మెగా హీరో కదా?.. ఒదిగి ఉండటం బ్లెడ్డులోనే ఉంటుందేమో.. నెటిజన్‌కు స్వీట్ రిప్లై

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News