Tollywood Top10 Heroes: టాలీవుడ్ లో టాప్ టెన్ హీరోస్ వీరే.. బయటపెట్టిన ఫేమస్ సర్వే

Ormax Survey 2024: సినీ ఇండస్ట్రీలో నెంబర్ గేమ్ కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. హీరో అభిమానులు అందరూ తమ హీరో నెంబర్ వన్ అంటే తమ హీరో నెంబర్ వన్ అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుపుతూనే ఉంటారు. ముఖ్యంగా ఈ జనరేషన్ తెలుగు హీరోస్ లో టాప్ వన్ ఎవరు అనేది ఇప్పటికీ తేలని విషయమే. అయితే ఒక పాపులర్ బాలీవుడ్ సర్వే లెక్కల ప్రకారం టాప్ టెన్ లో ఉన్న హీరోలు లిస్ట్ ఇదేనట..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 16, 2024, 01:47 PM IST
Tollywood Top10 Heroes: టాలీవుడ్ లో టాప్ టెన్ హీరోస్ వీరే.. బయటపెట్టిన ఫేమస్ సర్వే

Top 10 Telugu heroes: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో ఎవరు అన్న విషయంపై చాలా కాలంగా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో లేటెస్ట్ సర్వే టాప్ హీరోల గురించి ఊహించని ఫలితాలు అందించింది. ఒకప్పుడు తెలుగులో నెంబర్ వన్ హీరో ఎవరు అంటే ముందుగా సీనియర్ ఎన్టీఆర్ పేరు గుర్తొచ్చేది. ఆ తరువాత చిరంజీవి.. బాలకృష్ణ మధ్య ఎంతో పోటీఉండగా ఫైనల్ గా మొదటి స్థానం చిరంజీవి సంపాదించుకున్నాడు. కానీ ప్రస్తుత టాలీవుడ్ జనరేషన్ హీరోల్లో మాత్రం నెంబర్ వన్ స్నానం ఎవరు అనేది ఇంకా క్లారిటీ లేదు. 
ఈ క్రమంలో ప్రముఖ బాలీవుడ్ మీడియా ఆర్మాక్స్ నిర్వహించిన సర్వేలో టాలీవుడ్ టాప్ టెన్ హీరోలు ఎవరో తేలింది. 

ఈ లిస్టులో మొదటి స్థానంలో నిలిచారు ప్రభాస్. బాహుబలి మూవీ తర్వాత ఇండియా వైడే కాకుండా వరల్డ్ వైడ్ ఫేమస్ అయిన నటుడు ప్రభాస్. డార్లింగ్ కి ఉన్న పాపులారిటీ అతని హీరో నంబర్ వన్ స్థానంలో ఉంచింది. సలార్ మూవీతో తిరిగి ఫార్మ్ లోకి వచ్చిన ప్రభాస్ టాలీవుడ్ లో అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత స్థానం సూపర్ స్టార్ మహేష్ బాబుకి దక్కింది. ఒక్క పాన్ ఇండియా చిత్రం తన ఖాతాలో లేకపోయినా మహేష్ కి ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉన్న క్రేజ్ వల్ల మహేష్ రెండవ స్థానంలో నిలిచారు.

మూడవ స్థానంలో పుష్పరాజ్ వలన అల్లు అర్జున్ కైవసం చేసుకోగా, నాలుగవ స్థానంలో ఎన్టీఆర్ నిలిచారు.‌ కాగా ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోల నుండి రాబోయే సినిమాలు పుష్ప 2, దేవర పైన ఎన్ని అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ క్రమంలో వీరిద్దరూ మూడు, నాలుగు స్థానాల్లో నిలవడం వీరి అభిమానులను మరింత సంతోషానికి గురిచేస్తుంది. ఈ ఇద్దరు స్టార్ హీరోలకి టాలీవుడ్ లోనే కాక బాలీవుడ్ లో కూడా మార్కెట్ వాల్యూ పెరుగుతూ ఉంది. 

ఇక ఐదవ స్థానంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నిలిచారు.ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ గేమ్ చేంజెర్ మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఇక ఆరవ స్థానంలో పవన్ కళ్యాణ్ నిలిచారు. రాజకీయాల్లో బిజీగా ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ ఈ మధ్య కొన్ని సినిమాల పైన కూడా కాన్సెంట్రేట్ చేస్తూ ఉండడంతో.. ఈ హీరోకి ఆరవ స్థానం దక్కింది.

ఫైనల్ గా నేచురల్ స్టార్ నాని ఏడవ స్థానంలో ఉండగా మాస్ మహారాజు రవితేజ 8వ స్థానంలో ఉన్నారు. అనూహ్యంగా చిరంజీవిని వెనక్కి నెట్టి తొమ్మిదవ స్థానాన్ని విజయ్ దేవరకొండ దక్కించుకున్నాడు. ఇక పదవ స్థానంలో మెగాస్టార్ చిరంజీవి నిలిచారు. ప్రస్తుతానికి వచ్చిన ఈ టాలీవుడ్ టాప్ హీరో లెక్కలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. అనాదిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న కొందరు స్టార్ హీరోల పేర్లు వీటిలో లేకపోవడం కొందరిని ఇబ్బంది పెడుతోంది.

Also read: Jagan Convoy: సీఎం జగన్‌ పర్యటనలో అపశ్రుతి.. వాహనం ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News