Pakka Commercial Teaser: వారెవ్వా.. అనిపిస్తున్న పక్కా కమెర్షియల్ టీజర్

Pakka Commercial Teaser: గోపీచంద్ సరసన రాశి ఖన్నా జంటగా నటిస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా క్యారెక్టర్ కూడా సూపర్ కామెడి పండించే టైపులా ఉండనుందనిపించేలా టీజర్ కట్ చేశారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ప్రజెంట్ చేస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్స్ నిర్మాతలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 9, 2021, 05:23 AM IST
Pakka Commercial Teaser: వారెవ్వా.. అనిపిస్తున్న పక్కా కమెర్షియల్ టీజర్

Pakka Commercial Teaser: సీటీమార్ తర్వాత గోపీ చంద్ హీరోగా వస్తున్న మరో సినిమా పక్కా కమెర్షియల్. హిలేరియస్ కామెడి చిత్రాల దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తోన్న పక్కా కమెర్షియల్ మూవీ టీజర్ తాజాగా ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఈ టీజర్ చూస్తోంటే.. మారుతి ఈసారి కూడా మాస్ ఆడియెన్స్‌కి నచ్చేలా, ప్రతీ ఒక్కరూ మెచ్చేలా కామెడి ప్లస్ యాక్షన్ కలిపి కొట్టాడని అనిపిస్తోంది. గోపీచంద్ హీరోయిజం ఎక్స్‌ట్రీమ్ లెవెల్లో చూపిస్తూ.. అతడిని మరింత స్మార్ట్‌గానూ చూపించినట్టు పక్కా కమెర్షియల్ టీజర్ చూస్తే అర్థమవుతోంది. 

గోపీచంద్ సరసన రాశి ఖన్నా (Gopichand, Raashi Khanna) జంటగా నటిస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా క్యారెక్టర్ కూడా సూపర్ కామెడి పండించే టైపులా ఉండనుందనిపించేలా టీజర్ కట్ చేశారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ప్రజెంట్ చేస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్స్ నిర్మాతలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మొత్తానికి పక్కా కమెర్షియల్ టీజర్ (Pakka Commercial Teaser) చూస్తే... మారుతి చిత్రాల్లోని హీరో, హీరోయిన్స్ పాత్రలు ఎంత కామెడి పండిస్తాయో.. అంతే కామెడి ఈ సినిమాలోనూ గ్యారెంటీ అనిపించేలా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. పక్కా కమెర్షియల్ మూవీ టీజర్‌ని మీరు కూడా చూసేయండి.

 

ఇటీవలే సీటీమార్ మూవీతో (Seetimarr movie) ఆడియెన్స్ ముందుకొచ్చిన గోపీ చంద్.. త్వరలోనే పక్కా కమెర్షియల్ మూవీతో మరోసారి ఆడియెన్స్‌ని పలకరించనున్నాడు. త్వరలోనే మేకర్స్ పక్కా కమెర్షియల్ మూవీ రిలీజ్ డేట్ విషయంలో ఓ స్పష్టతకు రానున్నట్టు సమాచారం.

Trending News