Parineeti Chopra, Raghav Chadha Wedding: పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా పెళ్లికి వచ్చే అతిధులకు కండిషన్స్

Parineeti Chopra, Raghav Chadha Wedding: బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాల పెళ్లికి సర్వం సిద్ధమైంది. పరిణీతి చోప్రా, ఎంపీ రాఘవ్ చద్దాల పెళ్లి చాలా కాలంగా వార్తల్లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి పెళ్లి నిశ్చయం అయింది మొదలు.. పెళ్లి ఆహ్వాన పత్రికల వరకు ప్రతీ ఘట్టం సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్ అవుతూ వస్తోంది.

Written by - Pavan | Last Updated : Sep 24, 2023, 03:49 AM IST
Parineeti Chopra, Raghav Chadha Wedding: పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా పెళ్లికి వచ్చే అతిధులకు కండిషన్స్

Parineeti Chopra, Raghav Chadha Wedding: బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాల పెళ్లికి సర్వం సిద్ధమైంది. పరిణీతి చోప్రా, ఎంపీ రాఘవ్ చద్దాల పెళ్లి చాలా కాలంగా వార్తల్లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి పెళ్లి నిశ్చయం అయింది మొదలు.. పెళ్లి ఆహ్వాన పత్రికల వరకు ప్రతీ ఘట్టం సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్ అవుతూ వస్తోంది. తాజాగా పెళ్లి కూడా అంతే సెన్సేషన్ అయ్యేలా ప్లాన్ చేసుకోవడంలో పరిణీతి చోప్రా, ఎంపీ రాఘవ్ చద్దా బిజీగా ఉన్నారు. సెప్టెంబర్ 24 న .. అంటే రేపటి ఆదివారమే పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దాల పెళ్లి జరగనుంది. ఈ పెళ్లి వేడుక కోసం ఉదయ్ పూర్ లోని లీలా ప్యాలెస్ హోటల్ వేదిక కాబోతోంది. 

రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రాల పెళ్లి వేడుకకు భారీ సంఖ్యలో వీవీఐపీలు, సెలబ్రిటీలు రానున్న నేపథ్యంలో అక్కడ సన్నాహాలు, ఏర్పాట్లు ఓ రేంజులో కొనసాగుతున్నాయి. వధూవరుల కుటుంబసభ్యులు, వారి అతిథులు ఇప్పటికే హోటల్ లీలా ప్యాలెస్ వద్దకు చేరుకున్నారు. ఈ గ్రాండ్ ఈవెంట్ కోసం భారీ భద్రతను మోహరించారు. 

అతిథుల భద్రతరీత్యా ఫోటోలు, వీడియోలు రికార్డ్ చేయకుండా పెళ్లి వేడుక స్థలంలో టైట్ సెక్యురిటీని మొహరించారు. మొబైల్ కెమెరాలకు రెడ్ టేప్స్ అతికించారు. పెళ్లి వేడుకకు సంబంధించి ఎలాంటి ఫోటోలు, వీడియోలు తీయరాదని.. అలాగే పెళ్లి వేడుక ప్రారంభమైన వెంటనే నో పిక్చర్ పాలసీని అనుసరించాలని ఆహ్వానితులకు విజ్ఞప్తి చేశారు. పెళ్లికి వచ్చిన అతిథులు తమ నిబంధనలకు సహకరించాలని  పరిణితి చోప్రా, రాఘవ్ చద్దాలు కోరారు.

ఇండియా టుడేలో ప్రచురించిన ఓ కథనం ప్రకారం, హోటల్ లీలా ప్యాలెస్ లోని సిబ్బంది, ఇతర ఉద్యోగులు మూడు రోజుల పాటు బయటకు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. అలాగే, ఎవరైనా తమ మొబైల్ కెమెరాపై రెడ్ టేప్‌ను తొలగిస్తే వెంటనే సెక్యూరిటీకి ఓ అలర్ట్ వెళ్తుంది. ఆ వెంటనే సెక్యురిటీ వచ్చి వారిని ప్రశ్నించేలా ఏర్పాట్లు చేశారు. రాయల్ వెడ్డింగ్‌ కోసం ఢిల్లీ నుండి 12 మంది ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ ప్రత్యేకంగా ఉదయ్ పూర్ వస్తున్నారు.

వీవీఐపి, హైప్రొఫైల్ అతిథుల కోసం పోలీసులు, ప్రైవేట్ సెక్యురిటీ గార్డ్స్ లను మోహరించారు. రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ కావడంతో ఆ పార్టీకే చెందిన ముఖ్య నేతలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, దేశంలోని ఇతర రాజకీయ ప్రముఖులు ఈ గ్రాండ్ వెడ్డింగ్‌ ఈవెంట్‌కు హాజరుకానున్నారు. అలాగే, బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ప్రముఖ ఫిలిం మేకర్ కరణ్ జోహార్, డిజైనర్, మనీష్ మల్హోత్రాతో పాటు సుపరిచిత నటీనటులు ఎంతోమంది ఈ పెళ్లి వేడుకకు రానున్నారు. పరిణీతి చోప్రా సన్నిహిత మిత్రురాలు అయిన సానియా మీర్జా కూడా పెళ్లికి హాజరయ్యే అవకాశం ఉంది అని ఈ పెళ్లి ఏర్పాట్లు పరిశీలిస్తున్న వారు చెబుతున్నారు.

Trending News