Payal Rajput: పాయల్ రాజ్ పుత్ దెబ్బకు స్టార్ హీరోలు సైతం ఔట్.. మంగళవారం అరుదైన రికార్డ్..

Mangalavaram: ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతోనే మంచి విజయం సాధించడమే కాదు బోల్ట్ ఇమేజ్ కూడా సొంతం చేసుకుంది.. తాజాగా మంగళవారం అనే మరో బోల్ట్ సినిమాలో కనిపించి మెప్పించింది ఈ హీరోయిన్..

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 27, 2024, 07:42 PM IST
Payal Rajput: పాయల్ రాజ్ పుత్ దెబ్బకు స్టార్ హీరోలు సైతం ఔట్.. మంగళవారం అరుదైన రికార్డ్..

Mangalavaram Digital Streaming: అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమా అప్పట్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కార్తికేయ హీరోగా పరిచయమైన ఈ చిత్రం ద్వారా పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా పరిచయమైంది. మొదటి సినిమాలోనే బోల్డ్ పాత్రలో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది ఈ హీరోయిన్. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు పాయల్ కి మంచి ఇమేజ్ తెచ్చి పెట్టింది.

అయితే ఆ తరువాత ఈ బోల్డ్నెస్ నమ్ముకొని పాయల్ తీసిన సినిమాలు అన్ని ఫ్లాప్ అవుతూ రాసాగాయి. మధ్యలో వెంకటేష్ తో చేసిన వెంకీ మామ మాత్రం పరవాలేదు అనిపించుకుంది. ఈ నేపథ్యంలో మరోసారి తనకు ఆర్ఎక్స్ 100 లాంటి సూపర్ హిట్ అందించిన దర్శకుడు అజయ్ భూపతి తో మంగళవారం అనే చిత్రం చేసి మరో సూపర్ హిట్ అందుకుంది ఈ హీరోయిన్.

పాయల్ రాజ్ పుత్ ముఖ్య పాత్రలో ఆద్యంతం ఆకట్టుకునే బోల్డ్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆర్ఎక్స్ 100 తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ కి అంతటి విజయం అందించింది. అజనీష్ లోక్ నాథ్ సంగీతం, శివేంద్ర దాశరధి విజువల్స్ ఈ చిత్రానికి పెద్ద బలంగా నిలిచాయి. కాగా థియేటర్స్ లో అదరగొట్టిన ఈ సినిమా ఇప్పుడు బుల్లితెరపై కూడా సూపర్ సక్సెస్ అందుకుంది.

పెద్ద హీరో బ్లాక్ బస్టర్లు కూడా చిన్న తెర ప్రేక్షకులని అంతగా అలరించని పరిస్థితులు ప్రస్తుతానికి నడుస్తున్నాయి. అలాగే థియేటర్స్ లో ఫ్లాప్ అయిన చిత్రాలకి ఇక్కడ బ్రాహ్మరధం పట్టిన దాఖలాలు లేకపోలేదు. అయితే, థియేటర్ ప్రేక్షకులకి, టి.వి వీక్షకులకి ఒకే రేంజ్ లో ఓ చిత్రం నచ్చడం సాధారణ విషయం కాదు. ఇదే రికార్డ్ సాధించింది మంగళవారం.

ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితుల్లో కూడా అటు థియేటర్లలో, ఓటిటిలో అనూహ్య స్పందన లభించగా అదే రేంజ్ లో టీ.వి లో కూడా రేటింగ్ సంపాదించుకుంది ఈ చిత్రం. తాజాగా, 8.3 టీ.ఆర్.పి తో 'మంగళవారం' చిత్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో స్టార్ హీరోలు సినిమాలు సైతం అందుకొని అరుదైన రికార్డుని అందుకుంది.

ఈ సందర్భంగా దర్శకుడు అజయ్ భూపతి, నిర్మాతలు స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం మరియు ఇతర చిత్ర సభ్యులు తమ సంతోషం వ్యక్తం చేస్తూ కంటెంట్ చిత్రాలని ఎప్పుడూ ఆదరించే తెలుగు ప్రేక్షకులకి ధన్యవాదాలు అని తెలియజేశారు.

Also Read: Kuppam: చంద్రబాబును ఓడించండి.. కుప్పం అభివృద్ధి చేసుకుందాం: సీఎం జగన్‌ పిలుపు

Also Read: Floating Bridge: లేదు లేదు 'తేలియాడే వంతెన' కొట్టుకుపోలే.. మేమే దాన్ని విడదీశాం

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News