Salaar Digital Rights: ప్రభాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డీల్.. విడుదలకు ముందే సలార్ రికార్డులు

Prabhas Salaar Movie Latest Updates: ప్రభాస్ సలార్ మూవీ విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. టీజర్‌తో భారీ అంచనాలు పెంచేసిన సలార్.. నాన్ థియేట్రకల్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయినట్లు తెలిసింది. ప్రభాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డీల్ అంటున్నారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Sep 15, 2023, 08:31 AM IST
Salaar Digital Rights: ప్రభాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డీల్.. విడుదలకు ముందే సలార్ రికార్డులు

Prabhas Salaar Movie Latest Updates: పాన్ ఇండియా స్థాయిలో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ సలార్. రెబల్ స్టార్ ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన ఈ మూవీ ఈ నెల 28న ఆడియన్స్ ముందుకు రావాల్సి ఉండగా.. చిత్ర బృందం వాయిదా వేసింది. మూవీ రిలీజ్‌కు కారణాలు వెల్లడిస్తూ.. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది. నవంబర్ లేదా డిసెంబర్‌లో థియేటర్లలో సలార్ సందడి ఉంటుందని సినీ సర్కిల్‌లో ప్రచారం జరుగుతోంది. సలార్ సినిమా వాయిదా పడడంతో ప్రభాస్ అభిమానులు డిస్పాయింట్ అవుతున్నారు. అయితే వారికి అదిరిపోయే వార్త ఒకటి తెరపైకి వచ్చింది. సలార్ ఓటీటీ రైట్స్‌ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. 

టీజర్ విడుదలైనప్పటి నుంచి సలార్‌పై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ రికార్డ్ ధరకు పలికినట్లు సమాచారం. ఇప్పటికే రూ.350 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలిసింది. శాటిలైట్ రైట్స్‌ను స్టార్ నెట్‌వర్క్, ఓటీటీ హక్కులు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నాయట. విడుదలకు ముందే రికార్డుస్థాయి వసూళ్లు రాబట్టడంతో సలార్ మూవీపై ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. బాహుబలి తరువాత బ్లాక్‌బస్టర్ హిట్ లేని లోటు ఈ సినిమా ద్వారా తీరిపోతుందని అంటున్నారు. 

హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న సలార్ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. సలార్ చిత్రాన్ని రెండు పార్టులుగా తీసుకువస్తున్న విషయం తెలిసిందే. సలార్ చీజ్‌ఫైర్-1 అంటూ అభిమానులను అలరించేందుకు రెడీ అవుతోంది. ఈ ఏడాది రానున్న భారీ చిత్రాలలో సలార్ ఒకటి. 1980 బ్యాక్ డ్రాప్‌ మూవీ కథ సాగుతున్నట్లు తెలుస్తోంది. సున్నపు రాయి మాఫియా నేపథ్యంలో భారీ యాక్షన్ సీన్స్ ఉంటాయని అంటున్నారు. ప్రభాస్ క్యారెక్టర్ ఓ రేంజ్‌లో చూపించినట్లు ప్రచారం జరుగుతోంది. 

Also Read: Jawan OTT Release Update: దిమ్మతిరిగే రేటుకు జవాన్ ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?  

Also Read: Nipah Virus Latest Updates: ముంచుకొస్తున్న నిపా వైరస్ ముప్పు.. మరో ఇద్దరు మృతి.. రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News