One Year For Akhand : అఖండ వచ్చి ఏడాది.. షూటింగ్‌ ఎలా జరిగిందో చూపించిన ప్రగ్యా జైస్వాల్

One Year For Akhand అఖండ చిత్రం గతేడాది ఇదే సమయానికి విడుదలైంది. గత ఏడాది ఈ సమయానికి కరోనా సెకండ్ వేవ్ దెబ్బ గట్టిగానే పడి ఉంది. దీంతో అఖండ పరిస్థితి ఎలా ఉంటుందా? అని అంతా అనుకున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 2, 2022, 03:05 PM IST
  • బాలయ్య అఖండకు ఏడాది
  • వర్కింగ్ స్టిల్స్‌తో ప్రగ్యా రచ్చ
  • షూటింగ్‌లో బాలయ్యతో ప్రగ్యా
One Year For Akhand : అఖండ వచ్చి ఏడాది.. షూటింగ్‌ ఎలా జరిగిందో చూపించిన ప్రగ్యా జైస్వాల్

One Year For Akhanda : నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన మూడో చిత్రం అఖండ. గత ఏడాది గడ్డు పరిస్థితుల్లోనే ఈ చిత్రం విడుదలైంది. కరోనా సమయం అవ్వడం, ఏపీలో టికెట్ల రేట్లు తగ్గించడం వంటి పరిస్థితుల్లో అఖండ చిత్రం విడుదలైంది. ఈ అఖండ సినిమా విడుదలై నేటికి ఏడాది అవుతోంది. దీంతో హీరోయిన్‌గా నటించిన ప్రగ్యా జైస్వాల్‌ ఇప్పుడు నాటి విషయాలను పంచుకుంది. బాలయ్యతో పని చేసిన అనుభవం, అఖండ వర్కింగ్ స్టిల్స్‌తో ప్రగ్యా సందడి చేస్తోంది.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya)

అఖండ విడుదలై అప్పుడే ఏడాది అయిందంటే నమ్మలేకపోతోన్నా.. ఎన్నో మెమోరీస్ ఉన్నాయి.. ఎంతో నేర్చుకున్నాను.. అఖండ టీం ఎంతో గొప్పగా సహకరించింది.. ఈ అద్భుతమైన ప్రయాణంలో ఉన్న ప్రతీ ఒక్కరికీ ఎంతో రుణపడి ఉంటాను.. ప్రేక్షకులు కురిపించిన ప్రేమకు రుణపడి ఉంటాను.. ఈ సినిమాపై మీరు చూపించిన ఆదరణ ఎప్పటికీ ప్రత్యేకమే అని చెప్పుకొచ్చింది. ఇందులోని లాస్ట్ వీడియోలో షూటింగ్ కోసం తనను ఎలా రెడీ చేశారో చెప్పుకొచ్చింది.

అఖండ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. బాలయ్య బోయపాటి కాంబో అంటే ఎలా ఉంటుందో మరోసారి అఖండతో చూపించారు. ఈ చిత్రం కరోనా తరువాత అందరికీ ధైర్యాన్ని ఇచ్చింది. మంచి చిత్రం తీస్తే  జనాలు కచ్చితంగా థియేటర్లోకి వస్తారు అని నిరూపించింది. ఈ సినిమా తరువాత పుష్ప, శ్యాం సింగ రాయ్ సినిమా బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి.

ఇక అఖండ సినిమాకు సీక్వెల్ మీద చాలానే వార్తలు వచ్చాయి. సినిమా హిట్టైన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో అయితే సీక్వెల్‌కు లీడ్ వదిలినట్టు చూపించారు. మరి సీక్వెల్ ఉంటుందా? లేదా? అన్నది చూడాలి. బాలయ్య ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాడు. బోయపాటి సైతం రామ్‌తో సినిమా చేస్తున్నాడు. మరి పార్ట్ 2 వస్తుందా? లేదా? అన్నది అఖండ నిర్మాత చెప్పాల్సి ఉంది.

Also Read : HIT 2 Movie Review : హిట్‌ 2 రివ్యూ.. కోడి బుర్ర ఎవరిదంటే?

Also Read : Singer Revanth Blessed With Baby Girl : తండ్రైన సింగర్ రేవంత్‌.. పండంటి పాపకు జన్మనిచ్చిన అన్విత

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News