Baahubali: మరో బాహుబలి సిద్ధం.. బిగ్ అప్డేట్ ఇచ్చేసిన రాజమౌళి

Baahubali Crown of Blood Trailer: రాజమౌళి బాహుబలి సినిమా సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఏంటో అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళింది ఈ సినిమా. అలాంటి ఈ సినిమా గురించి ఇప్పుడు మరో అప్డేట్ ఇచ్చి రాజమౌళి అందరూ దృష్టినిేఏ ఆకట్టుకుంటున్నారు

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 1, 2024, 07:47 AM IST
Baahubali: మరో బాహుబలి సిద్ధం.. బిగ్ అప్డేట్ ఇచ్చేసిన రాజమౌళి

Baahubali Animated Series Trailer: రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అసలు అపజయం అంటే తెలియని ఈ దర్శకుడు తన బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. బాహుబలి సినిమా రాజమౌళికి పేరు తీసుకురావడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని కూడా ఎంతో పెంచింది. ప్రస్తుతం తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతోంది అంటే అందుకు ఈ తరంలో పునాది వేసింది మాత్రం బాహుబలి చిత్రమే.

ప్రభాస్ హీరోగా, రానా విలన్ గా, అనుష్క హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసి 2000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ చిత్రం మళ్లీ రానుంది అని రాజమౌళి తన సోషల్ మీడియాలో వేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటుంది.
''మాహిష్మతి ప్రజలు అతని నామస్మరణలో తరిస్తే, అతని పేరు పలుకుతుంటే... అతడి రాకను అడ్డుకోవడం.. ఈ విశ్వంలో ఎవరి వల్ల కాదు'' అని రాజమౌళి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కి ఒక చిన్న వీడియో కూడా జటపరిచారు.. ఆ వీడియోలో ట్రైలర్ త్వరలోనే వస్తోంది అని క్యాప్షన్ ఉంది.

 

ఇక ఆ వీడియో షేర్ చేస్తూ..బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరుతో యానిమేటెడ్ సిరీస్ సీరియస్ రానుంది అని  ఎస్ఎస్ రాజమౌళి చెప్పుకొచ్చాడు. ఇక ఈ వీడియో చూసి బాహుబలి అభిమానులు ఎంతగానో ఆనందపడుతున్నారు. కాగా .. ప్రస్తుతం మాజీ మూవీ మహేష్ బాబు సినిమా స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి 'బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్' సిరీస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తారా లేకపోతే ఈ సిరీస్ కి దర్శకులు ఎవరు? ఇక ఈ సిరీస్ ఏ ఓటీటీలో  స్ట్రీమింగ్ అవుతుంది? అనే వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. బహుశా... ఈ ఆనిమేటెడ్ సిరీస్ ట్రైలర్ విడుదల చేసినప్పుడు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది తెలుస్తోంది. 

కాగా 'బాహుబలి' తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా అంతర్జాతీయ స్థాయిలో విశేష ఆదరణ లభించింది. దీంతో రాజమౌళి స్టైల్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రపంచం మొత్తం ఆయన తీసే సినిమాల పైన దృష్టి పెట్టారు. ఈ క్రమంలో 'బాహుబలి' యానిమేటెడ్ సిరీస్ మీద ఇంటర్నేషనల్ ఆడియన్స్ చూపు పడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహాలు అవసరం లేదు. కాబట్టి ఈ సిరీస్ అన్ని భాషలలో విడుదలవుతుంది అని వినికిడి.

Also read: Janasena Glass Symbol: రెబెల్స్‌కు గాజు గ్లాసు గుర్తు, కూటమి అభ్యర్ధుల్లో ఆందోళన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News