Ram Charan counter: ఆయన్ని ఏమన్నా అంటే ఆయన ఊరుకుంటారేమో, వెనకాల ఉండే మేము ఊరుకోం!

Ram Charan Indirect counter to Roja: ల్తేరు వీరయ్య సినిమాతో మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న క్రమంలో విజయోత్సవ వేడుకలు తెలంగాణలోని వరంగల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు హాజరైన రామ్ చరణ్ ఆసక్తికర వ్యాక్యాలు చేశారు. ఆ వివరాలు  

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 28, 2023, 10:22 PM IST
Ram Charan counter: ఆయన్ని ఏమన్నా అంటే ఆయన ఊరుకుంటారేమో, వెనకాల ఉండే మేము ఊరుకోం!

Ram Charan Indirect counter to Roja: వాల్తేరు వీరయ్య సినిమాతో మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. సంక్రాంతి సందర్భంగా రవితేజతో కలిసి జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకోవడమే కాదు తన గత సినిమాల రికార్డులను కూడా బద్దలు కొడుతూ కలెక్షన్ విషయంలో ముందుకు దూసుకు వెళుతున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన విజయోత్సవ వేడుకలు తెలంగాణలోని వరంగల్ లో ఘనంగా నిర్వహించారు.

ఈ నేపథ్యంలో ఈ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరు అవ్వడమే కాదు అభిమానులను అలరించే విధంగా మాట్లాడి ఒక్కసారిగా హీట్ పెంచేశాడు. ఈ సందర్భంగా రామ్ చరణ్ తేజ మాట్లాడుతూ ముందు ఇలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలకు థాంక్స్ చెప్పాడు. తర్వాత ఇలాంటి పూనకాలు లోడింగ్ సినిమాని తనకు ఇచ్చినందుకు డైరెక్టర్ బాబీ సహా సినిమా రచయితలు చక్రవర్తి, కోన వెంకట్ లను అభినందించారు.

ఈ సినిమాకి వచ్చిన హిట్ టాక్ విన్న తర్వాత అమెరికా నుంచి ఎప్పుడు ఎప్పుడు వచ్చి సినిమా చూస్తానా అని ఆత్రుతగా ఎదురుచూశానని చూసిన తర్వాత అత్యద్భుతంగా అనిపించిందని చెప్పుకొచ్చారు. నేను మా నాన్నగారిని అక్కడ చూడలేదు నాకు ఒక బ్రదర్ లాగా ఆయన అనిపించారు అంటూ చిరంజీవి వేషధారణ గురించి ఆయన పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రామ్ చరణ్. ఇక అదే విధంగా ఆయన మాట్లాడుతూ సాధారణంగా చిరంజీవి గారు చాలా క్వైట్ గా ఉంటారని అంటూ ఉంటారు, చాలా సౌమ్యంగా ఉంటారని అంటూ ఉంటారు. ఆయన అలా ఉంటేనే ఇంతమంది జనం ఆయన కోసం వచ్చారు.

అదే ఆయన ఒక్కసారి పట్టు బిగించి పిడికిలి బిగిస్తే ఏమవుతుందో ఊహించుకోండి అంటూ ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఆయన క్వైట్ అయి ఉండవచ్చు కానీ ఆయన వెనక ఉండే మేము క్వైట్ కాదంటూ ఆయన కామెంట్ చేశారు. ఆయన గారు క్వైట్ గా ఉంటేనే ఇంత మంది అభిమానులు వచ్చారంటే, ఆయన గట్టిగా మాట్లాడితే ఏమవుద్దో మీ ఊహకే వదిలేస్తున్నానని అన్నారు.

ఆయన క్వైట్ గా ఉంటారేమో వెనకాల మేమందరం ఉన్నాం, ఆయన్ని ఏమన్నా అంటే మేము క్వైట్ గా ఉండమని అన్నారు. ఇక ఆయన అలా వ్యాఖ్యానించడంతో ఇటీవల మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న వారికి ఆయన కౌంటర్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఇటీవల మంత్రి రోజా మెగాస్టార్ చిరంజీవి గురించి ఆయన ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయలేదని అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేయడంతో రామ్ చరణ్ ఆమెకే పరోక్షంగా కౌంటర్ ఇచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. చూడాలి ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయనేది.

Also Read: Nandamuri Taraka Ratna Health: అత్యంత విషమంగా తారకరత్న పరిస్థితి.. బాబు ఏమన్నారంటే?

Also Read: Waltair Veerayya Success Event : వాల్తేరు వీరయ్య సక్సెస్ ఈవెంట్లో తొక్కిసలాట.. తీవ్ర గాయాలు?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

Trending News