Ram Charan Remuneration: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి.. ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేశారు. ఈ సినిమా ఏకంగా ఆస్కార్ బరిలో దిగి ఏకంగా రెండు ఆస్కార్ అవార్డులు కూడా దక్కించుకుంది. ఇకపోతే ఈ సినిమాలో అటు రామ్ చరణ్, ఇటు ఎన్టీఆర్ ఎవరికి వారు తమ పాత్రకు తగ్గట్టుగా పూర్తి న్యాయం చేశారు. అయితే సినిమా విడుదలైన తర్వాత చాలామంది ఎన్టీఆర్ అభిమానులు తమ హీరోకి అన్యాయం జరిగిందని కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.
తక్కువ నిడివి, తక్కువ స్క్రీన్ స్పేస్ ఇచ్చారు అని బాధపడ్డారు. కానీ రాజమౌళి మాత్రం ఎవరికీ ఎక్కడ అన్యాయం జరగలేదు. ఏ పాత్రకు సంబంధించి ఆ పాత్రలో వారు పూర్తి న్యాయం చేశారు. వారిద్దరికీ కూడా తాము సరైన క్యారెక్టర్ లోనే ఇచ్చాము అంటూ క్లారిటీ ఇచ్చారు రాజమౌళి.
ఇదిలా ఉండగా ఆర్ ఆర్ ఆర్ సినిమా తరువాత హీరోలు ఇద్దరు కూడా తమ తదుపరి చిత్రాలకు తమ రెమ్యూనరేషన్ తగ్గించుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళితే.. ప్రస్తుతం రామ్ చరణ్.. ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు.. ఈ సినిమాకి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ కేటాయించడం జరిగింది. అలాగే ఈ సినిమాలోని పాటల కోసం ఏకంగా రూ.90 కోట్ల వరకు ఖర్చు పెట్టారట.
ఇక అందుకే బడ్జెట్ పెరిగిన నేపథ్యంలో రామ్ చరణ్ రూ.65 కోట్లు పారితోషకం తీసుకున్నట్లు సమాచారం. ఇకపోతే ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఏకంగా రూ.80 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నా.. రాంచరణ్ ఇప్పుడు తన పారితోషకాన్ని తగ్గించుకున్నట్లు తెలుస్తోంది.
ఇక అదే ఎన్టీఆర్ విషయానికి వస్తే.. దేవరా కోసం ఎన్టీఆర్ కేవలం రూ.60 కోట్లు మాత్రమే తీసుకున్నారట. రామ్ చరణ్ తన రెమ్యూనరేషన్ తగ్గించుకున్నప్పటికీ కూడా ఎన్టీఆర్ కంటే మించి తీసుకున్నారనే వార్తలు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దాంతో మెగా పవర్ స్టార్ అభిమానులు ఖుషి అవుతున్నారు.
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.