Ram Gopal Varma: చిరు ఫ్యాన్ నేను.. అందుకే అలా ట్వీట్ చేశా.. ఎట్టకేలకు నోరు విప్పిన వర్మ

Ram Gopal Varma Clarity on about Chiranjeevi: ఎప్పటికప్పుడు తిక్క తిక్క ట్వీట్లు చేస్తూ చర్చనీయాంశం అవుతూ ఉండే వర్మ తన తాజా సినిమా ప్రమోషన్స్లో గతంలో చిరంజీవి గురించి చేసిన ట్వీట్ గురించి క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు   

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 7, 2022, 03:03 PM IST
Ram Gopal Varma: చిరు ఫ్యాన్ నేను.. అందుకే అలా ట్వీట్ చేశా.. ఎట్టకేలకు నోరు విప్పిన వర్మ

Ram Gopal Varma Clarity on tweet about Chiranjeevi: వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్‌గోపాల్‌ వర్మ... మరోసారి తనదైన శైలి పబ్లిసిటీ స్టంట్‌తో ముందుకొచ్చారు. డెంజరస్ సినిమా  ప్రమోషన్స్ కోసం...  అషూ రెడ్డితో ఓ ఇంటర్వ్యూ చేశారు. గతంలో వీరిద్దరూ ఓ కాఫీ షాప్ లో ఘాటుగా ముచ్చటించారు. అప్పట్లో ఆ ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా ఆర్జీవీ మళ్లీ అషూరెడ్డితో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఈ ఇంటర్వ్యూలో అషూరెడ్డి అందల ఆరబోత మామూలుగా లేదు. 

అందుకు తగ్గట్లు ఆర్జీవీ మాటలు కూడా అదే రేంజ్‌లో ఉన్నాయి. అయితే ఈ ఇంటర్వ్యూలో గతంలో మెగాస్టార్ చిరంజీవిపై చేసిన ఓ సెటైరికల్ ట్వీట్ గురించి టాపిక్ వచ్చింది. ఆ విషయంపై రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఓ అభిమానిగా మాత్రమే తాను ఆ ట్వీట్ పెట్టినట్లు క్లారిటీ ఇచ్చారు.  తాను ఓ సామన్యుడిలానే అభిప్రాయం వ్యక్తం చేస్తుంటానని... అందుకే ట్విట్టర్ ఉందని తెలిపారు. వ్యక్తిగతంగా ఎవరినీ టార్గెట్ చేయలేదని చెప్పారు. అంతేకాదు చిరంజీవి అంటే తనకు ఇష్టమని... ఎప్పుడూ వారి కుటుంబంపై సెటైర్ వేయలేదని అన్నారు. అసలు ఇంతకీ ఆ ట్వీట్‌లో ఏముందంటే...  అప్పట్లో చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు. 

ఇందుకు ఏ సినిమా చేస్తారనేది చర్చలు జరుగుతుండగా... ఆ సమయంలో ఆర్జీవీ ఓ ట్వీట్ చేశారు. ''చిరంజీవి గారు బాహుబలి లాంటి పెద్ద సినిమా చేయాలి. ఆయన పెద్ద స్టార్ కాబట్టి చిన్న సినిమా కాకుండా పెద్ద సినిమా తీయాలి.. అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు.  ఈ ట్వీట్‌పై అషూరెడ్డి ఇంటర్వ్యూలో టాపిక్ రాగా... అది నేను ఓ అభిమానిగా మాత్రమే విజ్ఞప్తి చేశానని తెలిపారు. అందులో సటైర్‌ ఏముందని అడిగారు.

ప్రస్తుతం ఆర్జీవీ తను తెరకెక్కించిన డేంజరస్ అనే చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో నటించారు. డిసెంబరు 9న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఈ సినిమాలో ఇద్దరు అమ్మాయిల మధ్య ఉన్న ప్రేమ కథను రొమాంటిక్‌గా తెరకెక్కించారు ఆర్జీవీ.
 Also Read: దక్షిణ కొరియా నుంచి రాగానే సమంత దగ్గరకు చైతూ.. అసలు విషయం అదేనా?

Also Read: Niharika Konidela: ఆ విషయంలో మా అత్త కాళ్లు మొక్కాలంటున్న మెగా డాటర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 
 

Trending News