పరిటాల సునీత పాత్రలో రమ్యకృష్ణ..?

   

Last Updated : Oct 14, 2017, 05:35 PM IST
పరిటాల సునీత పాత్రలో రమ్యకృష్ణ..?

పవన్ మల్లెల దర్శకత్వంలో నారా రోహిత్, రెజీనా నటిస్తున్న కొత్త చిత్రం "బాలకృష్ణుడు".  రాయ‌ల‌సీమ ముఠా తగాదాలు, ప్రతీకారాల నేప‌థ్యంలో వస్తున్న ఈ చిత్రం మాజీ మంత్రి పరిటాల రవి జీవితానికి సంబంధించిన కథతో రూపొందుతుందని కొన్ని కథనాలు వస్తున్నాయి.  ప‌రిటాల ర‌వి కిడ్నాప్‌కు గురైన సందర్భాలు‌, అదే సమయంలో ఆయ‌న సతీమణి సునీత చేసిన పోరాటం మొదలైన అంశాలతో ఈ చిత్రం తెరకెక్కనుందని వినికిడి. అయితే కిడ్నాపర్ పాత్రను నారా రోహిత్‌, పరిటాల సునీత పాత్రలో ర‌మ్యకృష్ణ నటిస్తున్నట్లు కూడా వార్తలు రావడం గమనార్హం. అయితే ర‌మ్యకృష్ణ ఈ పాత్రకు ఓకే చెప్పారా లేదా అన్న విషయం ఇంకా తేలాల్సి ఉంది. అయితే ఇది నిజమైన వార్తా.. లేక సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పుకారా అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఇక "బాలకృష్ణుడు" సినిమా విషయానికొస్తే నారా రోహిత్ లేటెస్ట్ లుక్ ఇప్పటికే బాగా పాపులర్ అయ్యింది.

Trending News