"రంగులరాట్నం" ట్రైలర్ వచ్చేసింది..!

రాజ్‌తరుణ్‌ కథానాయకుడిగా, నూతన నటి శుక్లా కథానాయికగా నటించిన చిత్రం ‘రంగులరాట్నం. 

Updated: Jan 3, 2018, 07:42 PM IST
"రంగులరాట్నం" ట్రైలర్ వచ్చేసింది..!

రాజ్‌తరుణ్‌ కథానాయకుడిగా, నూతన నటి శుక్లా కథానాయికగా నటించిన చిత్రం ‘రంగులరాట్నం. అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మించిన ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ట్రైలర్ ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు.  ‘ఉయ్యాల జంపాల’ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్ పై రాజ్‌తరుణ్‌ కథానాయకుడిగా తెరకెక్కించిన రెండవ చిత్రమిది.

సంక్రాంతికి వస్తున్న ఎన్నో ఆసక్తికరమైన చిత్రాలతో పాటు ఈ చిత్రం కూడా పోటీకి దిగడం విశేషం.  ప్రేయసి ప్రేమ కోసం తనకు ఇష్టం లేని పనులు చేస్తూ, తనకు ఇష్టమైన పనులకు దూరంగా ఉండే ఓ ప్రేమికుడి జీవితమే ఈ సినిమా కథ అని అంటున్నారు నిర్మాతలు. శ్రీరంజని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నారు. 

 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close