EAGLE Teaser: జనాలకు కట్టు కథ, ప్రభుత్వాలు కప్పెట్టిన కథ.. 'ఈగల్'లో ఓ రేంజ్‌లో రవితేజ డైలాగ్స్

Ravi Teja Eagle Movie Teaser Talk: మరో మాస్ మూవీతో ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అవుతున్నాడు మాస్ మహారాజా రవితేజ. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈగల్ మూవీ టీజర్‌ను విడుదల చేయగా.. ఇందులో రవి తేజ పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో అలరించాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 6, 2023, 11:32 PM IST
EAGLE Teaser: జనాలకు కట్టు కథ, ప్రభుత్వాలు కప్పెట్టిన కథ.. 'ఈగల్'లో ఓ రేంజ్‌లో రవితేజ డైలాగ్స్

Ravi Teja Eagle Movie Teaser Talk: మాస్ మహారాజా రవితేజ కెరీర్ ప్రారంభం నుంచీ హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటికే 'వాల్తేరు వీరయ్య', 'రావణాసుర' 'టైగర్ నాగేశ్వరరావు' వంటి మూడు చిత్రాలతో ఆడియన్స్‌ను అలరించాడు. ఈ క్రమంలో వచ్చే సంక్రాంతికి 'ఈగల్' అనే మరో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ అవుతున్నాడు. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీతో సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్నారు. డెబ్యూ మూవీకే పక్కా మాస్ కమర్షియల్ స్టోరీని ఎంచుకున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. KGF రేంజ్‌లో ఓవైపు హీరో పాత్రను ఎలివేట్ చేస్తూనే మరోవైపు భారీ యాక్షన్ సన్నివేశాలతో కట్ చేసిన ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. 

'కొండలో లావాను కిందకు పిలవకు.. ఊరూ ఉండదు, నీ ఉనికీ ఉండదు' అంటూ రవితేజ పవర్ ఫుల్ డైలాగ్ తో 'ఈగల్' టీజర్ ప్రారంభమైంది. అక్కడి నుంచి హీరో పాత్రకి ఎలివేషన్స్ ఇచ్చే డైలాగ్స్ తో, యాక్షన్ సీన్స్ తో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. 'అడవిలో ఉంటాడు.. నీడై తిరుగుతుంటాడు.. కనిపించడు కానీ వ్యాపించి ఉంటాడు', 'వెలుతురు వెళ్లే ప్రతీ చోటికి వాడి బుల్లెట్ వెళ్తుంది', 'ఇది విధ్వంసం మాత్రమే తర్వాత చూడబోయేది విశ్వరూపం' వంటి డైలాగ్స్ రవితేజ క్యారక్టర్  చేస్తున్నాయి. 

 

'ఈగల్' కథలో ఎక్కువ భాగం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందని తెలుస్తోంది. టీజర్ లో 'జనాలకు కట్టు కథ.. ప్రభుత్వాలు కప్పెట్టిన కథ' అని చెప్పడాన్ని బట్టి చూస్తే, ఏదో సరికొత్త కంటెంట్ తోనే వస్తున్నారనిపిస్తోంది. మాస్ రాజా నుంచి ఆయన ఫ్యాన్స్ ఆశించే అన్ని అంశాలు కలబోసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది. డైరెక్టర్ కార్తీక్ తో కలిసి మణిబాబు ఈ కథ మీద వర్క్ చేసినట్లు తెలుస్తోంది. రవితేజ ఇందులో పొడవాటి జుట్టు, పంచె కట్టుతో చేతిలో పెద్ద గన్ను పట్టుకొని కొత్త లుక్‌లో కనిపించారు. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పాత్రకు కూడా ప్రాధాన్యత ఉన్నట్లు టీజర్‌లో హింట్ ఇచ్చారు. మధుబాల, శ్రీనివాస్ అవసరాల, వినయ్ రాయ్, నవదీప్, అజయ్ ఘోష్.. ఇలా ప్రధాన పాత్రధారులందరినీ ఈ వీడియోలో భాగం చేశారు. 

టీజర్‌లో బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్స్ సినిమా థీమ్‌కి తగ్గట్టుగా ఆకట్టుకునే ఉన్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారి నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఓవరాల్‌గా 'ఈగల్' టీజర్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసేలా ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. మరి పెద్ద పండక్కి తీవ్రమైన పోటీ మధ్య థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా, 'టైగర్ నాగేశ్వరరావు'తో నిరాశపరిచిన రవితేజకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో వేచి చూడాలి. 

Also Read: ఆ టైంలో జరుగుంటే నా పరిస్థితి ఏమిటి.. డీప్ ఫేక్ వీడియో పైన స్పందించిన రష్మిక…

Also Read: Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయితే జైలు నుంచే పాలన సాగిస్తారా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News