RGV Vyooham Release Date: పట్టువదలని విక్రమార్కుడిలా విజయం సాధించిన ఆర్జీవి.. ఎట్టకేలకు మార్చి 2న 'వ్యూహం' విడుదల..

RGV Vyooham Release Date: ఏది ఏమైనా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అనుకున్నది సాధించాడు. తను తెరకెక్కించిన 'వ్యూహం' సినిమాకున్న అడ్డంకులు తొలిగించుకున్నాడు. మార్చి 2న విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు. 

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 28, 2024, 01:21 PM IST
RGV Vyooham Release Date: పట్టువదలని విక్రమార్కుడిలా విజయం సాధించిన ఆర్జీవి.. ఎట్టకేలకు మార్చి 2న 'వ్యూహం' విడుదల..

RGV Vyooham Release Date: ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు హీట్ ఎక్కాయి. అక్కడ అధికార, ప్రతిపక్షాల్లో ఉన్న వైయస్‌ఆర్సీపీ, తెలుగు దేశం పార్టీలు ఎన్నికల్లో గెలవడానికి సినిమాలను అస్త్రాలుగా వాడుతున్నాయి. ఈ కోవలో ఇప్పటికే వై.యస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి దోహదం చేసిన 'యాత్ర 2' మూవీ ఈ నెల 8న విడుదలైంది. ఈ మూవీకి టాక్‌కు తగ్గట్టు వసూళ్లను రాబట్టలేకపోయింది. మరోవైపు తెలుగు దేశం తరుపున 'రాజధాని ఫైల్స్' సినిమా వచ్చింది. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఇంపాక్ట్ చేయలేకపోయాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ సీఎం వై.యస్.జగన్మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన కొన్ని ముఖ్య సంఘటన ఆధారంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'వ్యూహం', 'శపథం' సినిమాలను తెరకెక్కించాడు. 

ఈ రెండు చిత్రాలను రామదూత క్రియేషన్స్ బ్యానర్ లో దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. ఈ సినిమాల్లో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటించారు. జగన్ సతీమణి వై.ఎస్. భారతి పాత్రలో మానస యాక్ట్ చేసింది. ఇప్పటికే ఓ సారి సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాపై టీడీపీ నేత లోకేష్ హైకోర్టుకు ఎక్కారు. ఈ సినిమా సెన్సార్ పై రివైజ్ కమిటీ వేసింది. దీంతో ఈ సినిమా విడుదల ఆలస్యమవుతూ వస్తోంది. తాజాగా ఈ సినిమాకున్న సెన్సార్ అడ్డంకులు తొలిగాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 2న "వ్యూహం" సినిమాని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్బంగా రామ్ గోపాల్ వర్మ పట్టువదలని విక్రమార్కుడిలా ఈ సినిమా విడుదలకు ఉన్న అడ్డంకులు తొలిగినట్టు చేతిలో గన్‌తో పాటు సెన్సార్ సర్టిఫికేట్ పట్టుకొని ఆర్జీవి ట్వీట్ చేసాడు. 

ఈ రెండు సినిమాలను తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 500 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. మొత్తంగా ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా సినిమా విడుదలకు సెన్సార్ బోర్డ్ అనుమతులు మంజూరు చేయడంపై ఆర్జీవితో పాటు నిర్మాత కిరణ్‌ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. 

Also Read: FD Interest Rates: ఎఫ్‌డీలపై అత్యధికంగా 9.50 శాతం వరకూ వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News