Sanjay Dutt First look: 'డబుల్ ఇస్మార్ట్‌'లో సంజయ్ దత్.. అంచనాలను పెంచేసిన ఫస్ట్ లుక్..

Sanjay Dutt First look: ఎనర్జిటిక్ స్టార్ రామ్ లేటెస్ట్ సినిమా డబుల్ ఇస్మార్ట్.  పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బుల్ సంజయ్ దత్ విలన్ గా నటించబోతున్నాడు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 30, 2023, 11:22 AM IST
Sanjay Dutt First look: 'డబుల్ ఇస్మార్ట్‌'లో సంజయ్ దత్.. అంచనాలను పెంచేసిన ఫస్ట్ లుక్..

Sanjay Dutt First look from Double Ismart: హీరో రామ్ పోతినేని- పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ‘'ఇస్మార్ట్‌ శంకర్‌' ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. 2019లో వచ్చిన ఈ సినిమా రామ్ కెరీర్ లో బిగ్గెస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తాజాగా ఈ చిత్రానికి స్వీకెల్ రూపొందుతుంది. మళ్లీ సేమ్ కాంబో 'డబుల్‌ ఇస్మార్ట్‌'గా (double ismart) రాబోతుంది. ఈ సారి ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో సంజయ్‌దత్‌ విలన్ గా నటిస్తున్నాడు. జూలై 29న సంజయ్ దత్ బర్త్ డే. ఇతడి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో చాలా స్టైలిష్ గా ఉన్నాడు సంజయ్. తాజా లుక్ పై సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. 

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవల ముంబయిలో ఓ యాక్షన్ సీన్ కూడా చిత్రీకరించారు. 'డబుల్ ఇస్మార్ట్‌'లో సంజయ్ దత్ ఫుల్ లెంగ్త్ రోల్‌లో కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. మొదటి షెడ్యూల్‌లోనే ఆయన షూటింగ్‌ సెట్‌లో కూడా అడుగుపెట్టారు. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కబోతున్న ఈ సినిమాను పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్- ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

Also Read: HBD Sanjay Dutt: 'లియో' అప్ డేట్.. 'అర్జున్ దాస్'గా వచ్చేసిన సంజయ్ దత్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News