Satya Dev Full Bottle First Look : పాదరసం లాంటి మనిషి.. ఫుల్ బాటిల్ అంటూ సత్యదేవ్ సందడి

Satya Dev Full Bottle First Look : సత్య దేవ్ తాజాగా తన కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు. ఫుల్ బాటిల్ అంటూ సత్య దేవ్ మాస్ మసాలా సినిమాతో అందరినీ మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 2, 2022, 11:57 AM IST
  • సత్య దేవ్ కొత్త సినిమా అప్డేట్
  • ఫుల్ బాటిల్ ఫస్ట్ లుక్ విడుదల
  • మెప్పించిన సత్య దేవ్ పోస్టర్
Satya Dev Full Bottle First Look : పాదరసం లాంటి మనిషి.. ఫుల్ బాటిల్ అంటూ సత్యదేవ్ సందడి

Satya Dev Full Bottle First Look : సత్య దేవ్ ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్నాడు. చిరంజీవి నటించిన గాడ్‌ ఫాదర్ సినిమాలో విలన్‌గా కనిపించి అందరినీ మెప్పించాడు. చిరంజీవిని ఢీ కొట్టే పాత్రలో సత్య దేవ్ అద్భుతంగా నటించేశాడు. ఇక అక్షయ్ కుమార్ రామసేతు సినిమాలో ఎవ్వరూ ఊహించని పాత్రలో కనిపించేశాడు సత్య దేవ్. అలా ప్రస్తుతం సత్య దేవ్ నటన గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అలాంటి సమయంలో సత్య దేవ్ నుంచి కొత్త సినిమా అప్డేట్ వచ్చింది.

స్రవంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ మీద రామాంజనేయులు జవ్వాజి, ఎస్‌డీ కంపెనీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తిమ్మరుసు సినిమాతో హిట్ కొట్టేసిన కాంబో మళ్లీ ఈ సినిమాతో రిపీట్ అవుతోంది. శరణ్ కొప్పిశెట్టి, సత్య దేవ్ మళ్లీ ఇలా ఫుల్ బాటిల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ఫుల్ బాటిల్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రం ఇప్పుడు అందరినీ ఆకట్టుకునేలా ఉంది.

 

కాకినాడలో ఈ కథ జరుగుతోన్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఆలో డ్రైవర్‌గా సత్య దేవ్ కనిపించబోతోన్నాడనిపిస్తోంది. ఇందులో సత్య దేవ్ మరీ మాస్ లుక్కులో కనిపిస్తున్నాడు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ మాత్రం కాస్త వెరైటీగానే ఉందనిపిస్తోంది. సత్య దేవ్ ఇది వరకు చేసిన సినిమాలు, పాత్రలకంటే ఇది కాస్త స్పెషల్‌గా అనిపిస్తోంది.

ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్‌గా ఫుల్ బాటిల్ సినిమా రాబోతోన్నట్టుంది. మెర్క్యూరీ సూరిగా సత్య దేవ్ అందరినీ నవ్వించబోతోన్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయని ప్రకటించారు. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోన్నట్టు మేకర్లు తెలిపారు. సుజాత సిద్దార్థ్ సినిమాటోగ్రాఫర్‌గా, సంతోష్ కామిరెడ్డి ఎడిటర్‌గా ఈ చిత్రానికి వీరు పని చేస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్లు.

Also Read : Hansika Motwani Husband : హన్సికకు కాబోయే భర్త ఇతడే.. బయటపెట్టేసిన బ్యూటీ  

Also Read : Bigg Boss Geetu - Sri Satya : ఊసరవెల్లి గీతూ.. ఎగిరిపడుతున్న సత్య.. ఈ వారం మూడేది ఎవరికి?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News