Bhagavanth Kesari: మాస్ పాట లేకుండానే బాలకృష్ణ సినిమా.. షాక్‌లో ఫ్యాన్స్‌..!

Nandamuri Balakrishna Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న "భగవంత్ కేసరి" సినిమా గురించి డైరెక్టర్ ఒక షాకింగ్ వార్త చెప్పారు. సినిమాలో ఒక్క మాస్ పాట కూడా లేదు అని చెప్పి ఫాన్స్ కి గట్టి షాక్ ఇచ్చారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 15, 2023, 11:23 AM IST
Bhagavanth Kesari: మాస్ పాట లేకుండానే బాలకృష్ణ సినిమా.. షాక్‌లో ఫ్యాన్స్‌..!

Nandamuri Balakrishna Bhagavanth Kesari: వరుస సూపర్ హిట్ సినిమాలతో కరియర్ లో ఒక రేంజ్ లో ముందుకు దూసుకుపోతున్న సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ త్వరలోనే ఇప్పుడు "భగవంత్ కేసరి" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఎంటర్టైన్మెంట్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అనిల్ రావిపూడి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా కాబట్టి ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకీ బాగానే పెరుగుతూ వస్తున్నాయి.

అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. మాస్ సినిమా అంటేనే గుర్తొచ్చే బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఒక్క మాస్ పాట కూడా లేదట. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు.

కథని ఎటూ డివియేట్ చేయకుండా తను అనుకున్న కథని ఉన్నది ఉన్నట్టుగా నెరేట్ చేయాలని అనిల్ రావిపూడి ఫిక్స్ అయ్యారట. అందుకే ఈ సినిమాలో అనవసరంగా ఎలాంటి పాటలు పెట్టలేదని చెప్పుకొచ్చారు. సినిమా మొత్తం మీద కేవలం మూడు పాటలు మాత్రమే ఉన్నాయట. అందులో రెండు పాటలు ఇప్పటికే విడుదలై మంచి ఆదరణ అందుకున్నాయి.

మరోవైపు మూడవ పాట సినిమా టైటిల్ సాంగ్ అని తెలుస్తోంది. అయితే ఫ్యాన్స్ నిరాశ చెందకుండా ఉండేందుకు అనిల్ రావిపూడి సినిమా నుంచి ఒక మాస్ సాంగ్ ని కూడా విడుదల చేయబోతున్నారట. కానీ ఆ పాట థియేటర్లో సినిమాలో మాత్రం కనిపించదు అని సమాచారం. ఏదేమైనా బాలకృష్ణ సినిమా అంటేనే చాలామందికి గుర్తొచ్చేది మాస్ పాటలు. మరి అలాంటిది బాలయ్య సినిమాలో మాస్ పాట లేకుండా అనిల్ రావిపూడి ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తారో వేచి చూడాలి.

ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ బాలయ్య భార్య పాత్ర పోషిస్తుండగా, స్టార్ బ్యూటీ శ్రీ లీల బాలకృష్ణ కూతురి పాత్రలో కనిపించబోతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై హరీష్ పెద్ది, సాహు గారపాటి ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య అక్టోబర్ 19న భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సినిమాతో కూడా బాలయ్య కచ్చితంగా హిట్ అందుకుని తన సక్సెస్ స్ట్రీక్ను కంటిన్యూ చేస్తారని ఫ్యాన్స్ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా చెబుతున్నారు.

Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!    

Also read: Chandrababu Case Updates: చంద్రబాబు ఆరోగ్యంపై ఏసీబీ కోర్టుకు న్యాయవాదులు, ఏసీ సౌకర్యం కల్పించాలని కోర్టు ఆదేశాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News