Sreeleela : ఫైనల్ గా బాలకృష్ణ సహాయంతో.. తనంటే ఏంటో రుజువు చేసుకున్న శ్రీలీల..

Bhagavanth Kesari : మొన్నటి వరకు శ్రీలీల అంటే కేవలం డాన్సులు లేదా గ్లామర్ అనుకున్నారు అందరూ. ఈ హీరోయిన్ ఏకంగా 12 సినిమా అవకాశాలు అందుకోవడంతో.. అసలు ఈమెకు ఇంత రేంజ్ ఉందా అని ఆశ్చర్యపోయారు మరికొందరు. ఏదో అందంగా ఉంది, డాన్స్ చేయడం వల్లే ఇన్ని అవకాశాలు తెచ్చుకుంది అని సోషల్ మీడియాలో చాలామంది కామెంట్లు కూడా పెట్టసాగారు. కానీ వారందరికీ బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాతో సమాధానమిచ్చేసింది శ్రీలీల.. శ్రీలీల అంటే కేవలం డాన్సులు,  గ్లామర్ కాదు అద్భుతమైన నటన కూడా అంటూ రుజువు చేసుకుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 20, 2023, 03:56 PM IST
Sreeleela : ఫైనల్ గా బాలకృష్ణ సహాయంతో.. తనంటే ఏంటో రుజువు చేసుకున్న శ్రీలీల..

Sreeleela : ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో సెన్సేషనల్ హీరోయిన్ ఎవరు అంటే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు శ్రీలీల. పెళ్లి సందడి సినిమాతో పరిచయమైన ఈ హీరోయిన్ ఆ తరువాత రవితేజ ధమాకా చిత్రంతో సూపర్ హిట్ అందుకుంది. కాగా ఏకంగా పన్నెండు సినిమాలు సైన్ చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ వారిని అలానే సినీ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది.

కాగా డాన్స్ తో అదరగొట్టిన ఈ హీరోయిన్ పైన నిన్నటి వరకు మాత్రం ఎన్నో అనుమానాలు ప్రేక్షకులకు ఉందిన్నాయి. అది ఎందుకు అంటే ఈ హీరోయిన్ ఇప్పటివరకు నటించిన ఏ చిత్రంలోని ఈమె నటన‌ కనబడచడానికి పెద్దగా అవకాశం రాలేదు. దానికి తోడు ఈమధ్య శ్రీలీల నటించిన స్కంద సినిమా ఫ్లాప్ గా నిలిచింది. అంతేకాదు ఆ సినిమాలో శ్రీలీల కి పెద్దగా ప్రాధాన్యత కూడా లేదు.

హీరోయిన్ ఎంత అందంగా ఉన్నప్పటికీ కూడా.. అదే రేంజ్ లో నటన ఉంటేనే వాళ్ళు స్టార్ హీరోయిన్ అవ్వగలరు. ఉదాహరణకి కీర్తి సురేష్ కి మహానటి అలానే అనుష్కకి అరుంధతి లాంటి సినిమాలు వచ్చు ఉండకపోతే వారి నటన గురించి ఎవరికీ తెలిసి ఉండదు. మరి శ్రీ లీలాలో కూడా అంత నటన నిజంగా ఉందా లేదా కేవలం గ్లామర్ వల్ల లేదా డాన్సుల వల్ల హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుందా అని అందరూ అనుమానపడ్డారు.

కాగా ఈ అనుమానాలు అన్ని బాలకృష్ణ సినిమా భగవంత్ కేసరి తో తీర్చేసింది ఈ హీరోయిన్. ఈ సినిమాలో ఎమోషన్స్ దగ్గర నుంచి ఏకంగా ఫైట్స్ వరకు.. తాను అన్నీ చేయగలను అని తెలియజేసింది. నటన పరంగా, డాన్స్ పరంగా ఆఖరికి ఫైట్స్ పరంగా కూడా ఈ సినిమాతో సూపర్ అనిపించుకుంది శ్రీ లీల.

ఈ సినిమా మొదటి హాఫ్ లో అలానే క్లైమాక్స్ లో శ్రీలీల కి బాలకృష్ణ ఆయనకి సమానంగా ప్రాధాన్యత ఇచ్చాడు. ఇది ఒక స్టార్ హీరో సినిమా అయినప్పటికీ.. క్లైమాక్స్ సీన్ లో కూడా బాలకృష్ణ కొంచెం తగ్గి శ్రీ లీలా పాత్రకు ఎలివేషన్ ఇవ్వడం  అందరినీ ఆశ్చర్యపరచడమే కాకుండా ఆకట్టుకుంది కూడా.

ఇంకే సీనియర్ హీరో అయ్యి ఉన్నా కూడా ఆమె పాత్రకు ఇంత ప్రాధాన్యత ఇచ్చి ఉండేవారు కాదేమో. కానీ బాలకృష్ణ మాత్రం తన క్యారెక్టర్ లో హుందాగా నటిస్తూ పక్కన ఉన్న శ్రీలీల కి కూడా మంచి స్కోప్ ఇచ్చి తానంటే ఏంటో రుజువు చేసుకోడానికి ఛాన్స్ ఇచ్చేశారు.

దీనికి తోడు ఈ సినిమా మొదటి షో నుంచే మంచి రెస్పాన్స్ కూడా సొంతం చేసుకుంది. ఎమోషన్స్ అలానే మంచి యాక్షన్ కలగలిపిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఈ దసరాకి విన్నర్ గా కూడా నిలబెట్టేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా విజయం గురించి పక్కన పెడితే ఈ చిత్రం శ్రీలీల కెరియర్ లో ఈ సినిమాలోని విజ్జి పాప అలియాస్ విజయలక్ష్మి క్యారెక్టర్ ఒక మైలురాయిగా నిలిచిపోవడం మాత్రం ఖాయం.

Also Read: CM Jagan: ఏపీలో అర్చకులకు శుభవార్త.. సీఎం జగన్ దసరా గిఫ్ట్  

Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News