Regina Cassandra Birthday : రెజీనా బర్త్ డే.. రొమాంటిక్ పిక్‌తో లవ్యూ చెప్పిన సందీప్ కిషన్.. నెటిజన్ల సెటైర్లు వైరల్

Regina Cassandra Birthday రెజినా బర్త్ డే స్పెషల్ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అసలే రెజినా ఈ మధ్య కాంట్రవర్సీ స్టేట్మెంట్లతో నానా రచ్చ చేసిన విషయం తెలిసిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 13, 2022, 03:18 PM IST
  • రెజినా బర్త్ డే స్పెషల్
  • సందీప్ కిషన్ పోస్ట్ వైరల్
  • నెటిజన్ల సెటైర్లు వైరల్
Regina Cassandra Birthday : రెజీనా బర్త్ డే.. రొమాంటిక్ పిక్‌తో లవ్యూ చెప్పిన సందీప్ కిషన్.. నెటిజన్ల సెటైర్లు వైరల్

Regina Cassandra Birthday రెజినా, సందీప్ కిషన్‌లు తమ తమ కెరీర్ స్టార్టింగ్‌లో కలిసి పని చేశారు. రొమాంటిక్ లవ్ స్టోరీ అంటూ ఓ సినిమాలో కలిసి నటించారు. ఆ తరువాత కూడా కొన్ని సినిమాలు చేశారు. అయితే ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ అప్పట్లో టాక్ కూడా వచ్చింది. అయితే సందీప్ కిషన్‌తో నటించిన రెజినా, రాశీ ఖన్నా, రకుల్ ప్రీత్ ఇలా అందరూ కూడా త్వరత్వరగా స్టార్ హీరోయిన్లుగా ఎదిగిపోయారు. సందీప్ కిషన్‌ మాత్రం ఇంకా మిడ్ రేంజ్‌ హీరోగానే ఉన్నాడు.

సందీప్ కిషన్‌కు సరైన హిట్ మాత్రం పడటం లేదు. కానీ సందీప్ కిషన్ ముందు జాగ్రత్తగా ఆలోచించి ఫుడ్ బిజినెస్ కూడా ప్రారంభించేశాడు. ఇటు వ్యాపారం, అటు సినిమాలు అంటూ సందీప్ ఫుల్ బిజీగా ఉంటాడు. ఇప్పుడు సందీప్ కిషన్ తన ఫ్రెండ్, తోటి హీరోయిన్‌ రెజినాకు చెప్పిన విషెస్, షేర్ చేసిన పర్సనల్ పిక్‌ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

 

హ్యాపీ బర్త్ డే పాపా.. లవ్యూ.. నీకు అన్నింట్లో మంచే జరగాలి.. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి.. అంటూ ఇలా విషెస్ చెప్పాడు. అయితే రెజినా అప్పట్లో మ్యాగీ, రెండు నిమిషాలు అంటూ చేసిన కామెంట్ గురించి అందరికీ తెలిసిందే. మగాళ్లది అంతా రెండు నిమిషాల్లోనే అయిపోతుంది అంటూ రెజినా చేసిన బోల్డ్ కామెంట్ అప్పట్లో తెగ ట్రోల్ అయింది.

 

అదే కామెంట్‌ను ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. సందీప్ కిషన్ అన్నా.. రెండు నిమిషాల్లోనే అయిపోయిందా ఆమె దగ్గరా? అని ఆడేసుకుంటున్నారు. అన్నా ఏయ్ అని ఇంకొందరు మీమ్స్ పెడుతున్నారు. మొత్తానికి రెజినా పుట్టిన రోజుకు సందీప్ కిషన్ ఇలా బుక్కయ్యాడు. శాకిని డాకినీ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రెజినా చేసిన మ్యాగీ కామెంట్లు, రిపోర్టర్లు, మీడియాతో ప్రవర్తించిన తీరు అందరికీ తెలిసిందే.

Also Read : Anchor Suma : స్టాఫ్‌ను నెట్టి అవతల పారేసిన యాంకర్ సుమ.. వీడియో వైరల్

Also Read : Shriya Saran photoshoot : జాకెట్ విప్పేసిన శ్రియా.. షాట్స్ బాగా నచ్చాయన్న హీరోయిన్.. పిక్స్ వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News