తొలి హీరోయిన్ Kajal Aggarwal‌తో కాదు.. చందమామ స్థానంలో తాప్సీ!

Taapsee to Replace Kajal Aggarwal In Alivelu Venkataramana: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. దక్షిణాదిన ఆమె చేసిన సినిమాల్లో దాదాపు అన్నీ సూపర్ స్టార్స్, అగ్ర హీరోల సరసన చేసినవే ఉన్నాయి. అయితే ఆమెకు హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అవకాశం ఇచ్చింది దర్శకుడు తేజ. 

Last Updated : Jan 6, 2021, 05:48 PM IST
  • తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీ అలివేలు వెంకటరమణ
  • పెళ్లికి ముందు ఓకే చేసిన కాజల్.. ఇప్పడు కాల్షీట్స్ ప్రాబ్లమ్
  • టాలీవుడ్ చందమామ స్థానంలో మరో నటి తాప్సీకు ఛాన్స్
తొలి హీరోయిన్ Kajal Aggarwal‌తో కాదు.. చందమామ స్థానంలో తాప్సీ!

Taapsee likely to Replace Kajal Aggarwal In Tejas Alivelu Venkataramana: దశాబ్దం గడిచినా వన్నె తగ్గని అందంతో దూసుకెళ్తోంది టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. దక్షిణాదిన ఆమె చేసిన సినిమాల్లో దాదాపు అన్నీ సూపర్ స్టార్స్, అగ్ర హీరోల సరసన చేసినవే ఉన్నాయి. అయితే ఆమెకు హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అవకాశం ఇచ్చింది దర్శకుడు తేజ. 

గతేడాది చివర్లో చిన్ననాటి స్నేహితుడు గౌత్ కిచ్లును వివాహం చేసుకున్న కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) హనీమూన్‌కు మాల్దీవులకు వెళ్లొచ్చింది. ఆచార్య మూవీ షూటింగ్‌లో సైతం పాల్గొంటోంది కాజల్ అగర్వాల్. అయితే ఓ వివాహం తర్వాత కాజల్ షెడ్యూల్, కాల్‌షీట్లు కాస్త మారినట్లుగా కనిపిస్తున్నాయి. తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘అలివేలు వెంకటరమణ’ సినిమాకు గతంలో కాజల్ ఒప్పుకున్నారు. ఈ ప్రాజెక్టు నుంచి చందమామ కాజల్ తప్పుకున్నారని టాలీవుడ్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది.

Also Read: Banita Sandhu Photos: బాలీవుడ్ నటి బనితా సంధు లేటెస్ట్ ఫొటోస్

తనకు తొలి సినిమా ఛాన్స్ ఇచ్చిన Tollywood దర్శకుడు తేజ ప్రాజెక్టు చేసేందుకు కాజల్‌ సిద్ధంగా ఉన్నా ఆమె కాల్‌షీట్ అడ్జస్ట్ చేయలేకపోతున్నారని తెలుస్తోంది. అదే సమయంలో హీరోయిన్ తాప్సీ పన్ను పేరు తెరమీదకి వచ్చింది. కాజల్ అగర్వాల్ స్థానంలో తాప్సీ వైపు డైరెక్టర్ తేజ మొగ్గు చూపారని సమాచారం. దీనిపై అధికారికంగా మూవీ యూనిట్ స్పందించే వరకు వేచిచూడాల్సిందే.

 Gallery: Anchor Manjusha Photos: యాంకర్ మంజూష లేటెస్ట్ ఫొటోస్

కాగా, లక్ష్మీ కళ్యాణం సినిమాతో కాజల్‌ను తెలుగు తెరకు పరిచయం చేశారు దర్శకుడు. ఆపై వీరి కాంబినేషన్‌లో నేను రాజు నేను మంత్రి, ఆ తర్వాత సీత సినిమాలు వచ్చి విజయం సాధించాయని తెలిసిందే. 

 

Also Read: Raviteja: కొడుకు ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన మాస్ మహారాజా రవితేజ 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News