Oscar Awards 2023: ఆస్కార్ వేడుకలో ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ, ఓటేసిన హీరో సూర్య, ఎవరికో తెలుసా

Oscar Award‌s 2023:  ఆస్కార్ సంరంభం ప్రారంభమౌతోంది. ఆర్ఆర్ఆర్ పోటీపై అందరి దృష్టీ నెలకొంది. ఆస్కార్ వేదిక అమెరికాలో అప్పుడే వేడుక ప్రారంభమైపోయింది. ఓటు హక్కు కలిగిన ఇండియన్లు ఇప్పటికే ఓటేసేశారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 11, 2023, 08:44 AM IST
Oscar Awards 2023: ఆస్కార్ వేడుకలో ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ, ఓటేసిన హీరో సూర్య, ఎవరికో తెలుసా

Oscar Awards 2023: మార్చ్ 13 ఉదయం నుంచి సాయంత్రం వరకూ లాస్ ఏంజిల్స్‌లోని డోల్బీ థియేటర్స్‌లో అత్యంత వైభవంగా ఆస్కార్ వేడుక జరగనుంది. ఆస్కార్ అవార్డులకు ఇప్పుడు ఓట్లు పోలవుతున్నాయి. 

ఆర్ఆర్ఆర్ అవార్డుల ప్రదానోత్సవానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మరో 48 గంటల్లో ఆస్కార్ బరిలో గెలిచేదెవరో తేలిపోనుంది. ఆస్కార్ అవార్డుల కార్యక్రమం ఈసారి అత్యంత ప్రతిష్ఠాత్మకం కానుంది. దేశం మొత్తం ఎన్నడూ లేనంతా ఈసారి జరిగే ఆస్కార్ అవార్డుల కోసం ఎదురుచూస్తోంది. దీనికి కారణం ఆర్ఆర్ఆర్. ఇప్పటికే అమెరికాలో ఆస్కార్ సందడి ప్రారంభమైంది. లాస్ ఏంజిల్స్‌లోని డోల్బీ థియేటర్ వేదికగా జరగనున్న ఆస్కార్ అవార్డుల వేడుకకై ఇప్పుడు ఓటింగ్ జరుగుతోంది. వివిధ దేశాల్లో ఓటు హక్కు కలిగిన నటీనటులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 

అందరి దృష్టీ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాపైనే పడింది. ఇప్పటికే ఈ సినిమాలోని నాటు నాటు  పాట ఆస్కార్ నామినేషన్లలో నిలవడంతో ఏం జరుగుతుందోనే ఉత్కంఠ నెలకొంది. ఆస్కార్ జ్యూరీ సభ్యుడిగా ఉన్న తమిళ స్టార్ హీరో సూర్య తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాను ఓటు వేసినట్టు సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశాడు సూర్య. ఓటెవరికి వేసిందో మాత్రం వెల్లడించలేదు.

Also read: Venkatesh Maha Warning:వెబ్ సిరీస్లో బూతులు.. కేజీఎఫ్ దెబ్బకు వెంకటేష్ 'మహా' ముందు జాగ్రత్త..వార్నింగ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News