B - Grade Films Actresses: 'బి' గ్రేడ్ సినిమాలతో కుర్రకారును మతులు పోగొట్టిన బ్యూటీలు వెళ్లే!

B - Grade Films Actress: టీవీ ఇండస్ట్రీలో ఆర్టిస్టులుగా అడుగుపెట్టి.. ఆ తరువాత బాలీవుడ్ బి గ్రేడ్ మూవీల్లో, ఇంకొన్ని బాలీవుడ్ సినిమాల్లో తళుక్కుమన్న హీరోయిన్స్ గురించి ఇప్పుడు ఒక స్మాల్ లుక్కేద్దాం. వాళ్లంతా బుల్లితెరపై నటీమణులే అయినప్పటికీ.. బి గ్రేడ్ సినిమాల్లో మెయిన్ స్ట్రీమ్ టాప్ హీరోయిన్స్‌ని మైమరిపించిన వాళ్లే.. ఇంతకీ ఎవరా హీరోయిన్స్ ???

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 28, 2023, 01:30 PM IST
B - Grade Films Actresses: 'బి' గ్రేడ్ సినిమాలతో కుర్రకారును మతులు పోగొట్టిన బ్యూటీలు వెళ్లే!

Fame by B-Grade Films Heroines: సినిమా ఇండస్ట్రీలో, టీవీ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అడుగు పెట్టాకా తమ కెరీర్ క్లిక్ అయినా .. కాకపోయినా.. సెలెక్టివ్ రోల్స్ చేసే వాళ్లు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు. అలా కాకుండా అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని కాదనకుండా సైన్ చేసే వాళ్లే ఎక్కువగా ఉంటారు. నటనపై ఉన్న అమితమైన మక్కువతో పాటు ప్రతీ ఒక్క అవకాశాన్ని అందిపుచ్చుకుంటేనే ఏదో ఒక ఛాన్స్ తమకు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చి పెడతాయని ఆశపడటం అందుకు ఒక కారణమైతే.. ఇండస్ట్రీలో మనుగడ కోసం, ఆర్థిక ఇబ్బందులను అధిగమించడం కోసం కూడా ఏ ఒక్క అవకాశాన్ని కాదనకుండా సైన్ చేసే వాళ్లు కూడా ఉంటారు. 

పాయల్ రోహ్తగీ : 

television-actresses-who-romanced-in-B-grade-films-payal-rohtagi-sambhavana-seth-shama-sikander-urvashi-dholakia-to-sana-khan.jpg
పాయల్ రోహ్తగీ తొలుత టీవీ ద్వారానే తన కెరీర్ ఆరంభించినప్పటికీ.. ఆ తరువాత ఎన్నో బాలీవుడ్ బీ గ్రేడ్ సినిమాల్లో నటించింది. తౌబ తౌబ, ఏక్ సే మేరా క్యా హోగా అనే చిత్రాలతో పాయల్ కుర్రకారును హుషారెత్తించింది. 

ఊర్వశి దోళాకియా : 
ఊర్వశి దోళాకియా సైతం కెరీర్ తొలినాళ్లలో టీవీ ఆర్టిస్టుగానే ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ తరువాత ఆమె బి గ్రేడ్ సినిమాలు చేసి ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్ చేసింది. స్వప్నం సినిమా ఆమెకు బాగా పేరు తీసుకొచ్చి పెట్టింది. 

సంభావనా సేత్ : 

television-actresses-who-romanced-in-B-grade-films-payal-rohtagi-sambhavana-seth-shama-sikander-urvashi-dholakia-to-sana-khan.jpg
బోజ్‌పురి ఇండస్ట్రీని ఏలిన అతి కొద్ది మంది హీరోయిన్స్‌లో సంభావనా సేత్ కూడా ఒకరు. సంభావనా సేత్ గ్లామర్‌కి ఫిదా కాని కుర్రకారు లేరు. సంభావనా సేత్ కూడా కెరీర్ ఆరంభంలో టీవీ ఇండస్ట్రీ ద్వారానే ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత బాలీవుడ్, బోజ్‌పురి సినిమాల్లో హీరోయిన్‌గా , ఐటం సాంగ్స్‌లో ఐటం గాళ్‌గా తళుక్కుమంది.

రష్మీ దేశాయ్  : 
బుల్లితెరపై రాణించిన రష్మీ దేశాయ్‌కి అనుకోకుండా బోజ్‌పురి బీ గ్రేడ్ సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. ఆ తరువాత ఆమె అనేక బి గ్రేడ్ సినిమాలు చేసింది. బల్మా బడా నదాన్, తోహ్సే ప్యార్ బా వంటి చిత్రాలు ఆమె నటించినవే. 

షామా సికందర్ : 
స్మాల్ స్క్రీన్ క్వీన్ షామా సికందర్ కూడా ఒకప్పుడు అమీర్ ఖాన్ సోదరుడు ఫైజల్ ఖాన్‌తో బస్తీ అనే బి గ్రేడ్ సినిమాలో నటించి తన గ్లామర్‌తో ఆడియెన్స్‌ని ఫిదా చేసింది.

television-actresses-who-romanced-in-B-grade-films-payal-rohtagi-sambhavana-seth-shama-sikander-urvashi-dholakia-to-sana-khan-4.jpg

ఇది కూడా చదవండి : virat kohli net worth: విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఆస్తుల విలువ తెలిస్తే షాకవుతారు

సనా ఖాన్ :
బాలీవుడ్ హీరోయిన్స్‌తో పోటీ పడే అందం ఉన్న సనా ఖాన్ కూడా టీవీ ఇండస్ట్రీతో కెరీర్ ఆరంభించి.. ఆమధ్యలో " క్లైమాక్స్ " అనే బి గ్రేడ్ సినిమాలో తళుక్కుమంది. పెళ్లి తరువాత క్రమక్రమంగా సినీ పరిశ్రమకు దూరమైన సనా ఖాన్.. ఆ తరువాత డీసెంట్ లైఫ్ లీడ్ చేస్తూ సోషల్ మీడియాలో తన పాత పోస్టులను డిలీట్ చేసిన సంగతి కూడా తెలిసిందే.

అర్చనా పురాన్ సింగ్ : 
అర్చనా పురాన్ సింగ్ కూడా " రాత్ కే గుణ " అనే బి గ్రేడ్ సినిమాలో నటించి కుర్రకారును కవ్వించిన లేడీనే అనే విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి : Lust Stories 2 Trailer: లస్ట్ స్టోరీస్ 2 ట్రైలర్.. పెళ్లికి ముందు టెస్ట్ డ్రైవ్.. పెళ్లి తరువాత ఫుల్ డ్రైవ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News