Bigg Boss 5: అభిమానులకు గుడ్ న్యూస్...సెప్టెంబర్ 5 నుంచి బిగ్‌బాస్ షో ప్రారంభం

వచ్చే నెలలోనే బిగ్‌బాస్ సీజన్ 5 ప్రారంభం కానుందని ట్విట్టర్ వేదికగా స్టార్ మా ఛానెల్ ప్రకటించింది. కంటెస్టెంట్స్ ల గురించి తెలియాలంటే మరి కొన్ని రోజులు ఈ సస్పెన్స్ తప్పదు మరీ!  

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 26, 2021, 02:53 PM IST
  • సెప్టెంబర్ 5 నుండి ప్రసారం కానున్న తెలుగు సెప్టెంబర్ 5 షో
  • ట్విట్టర్ ద్వారా వెల్లడించిన 'స్టార్ మా' ఛానెల్
  • కాగా.. ఇప్పటి వరకు వెల్లడికానీ కంటెస్టెంట్ల పేర్లు
Bigg Boss 5: అభిమానులకు గుడ్ న్యూస్...సెప్టెంబర్ 5 నుంచి బిగ్‌బాస్ షో ప్రారంభం

Bigg Boss Telugu Season 5: అభిమానులకు గుడ్ న్యూస్.. అదేంటంటే ఎప్పుడెప్పుడా అని చూస్తున్న బిగ్‌బాస్ అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 (Bigg Boss Telugu Season 5) సెప్టెంబర్ 5  (September 5 2021) న ప్రారంభం కానుందన్నవిషయం అధికారికంగా వెలువడింది. 

సెప్టెంబర్ 5 నుంచి బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 ప్రముఖ టీవీ ఛానెల్ 'స్టార్ మా' (Star Maa)లో ప్రసారం కాబోతున్నట్లు పోస్ట‌ర్ ద్వారా అధికారికంగా ప్ర‌క‌టించారు. ఇది వరకు విదులైన ప్రోమోని (Bigg Boss Latest Promo) ఆధారంగా చేసుకొని కొత్త టీజర్ తో పాటూ విడుదల తేదీని ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. సెప్టెంబర్ 5 న సాయంత్రం 6గం.లకు ప్రారంభం అవనుండగా... సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 10 గం.లకు మరియు శని, ఆదివారాల్లో రాత్రి 9గం.లకు ప్రారంభం అవనుంది. 

Also Read: Sensational comments: "చెప్పు తెగుద్ది...యెదవ" జో బైడెన్ పై నిప్పులు చెరిగిన యంగ్ హీరో!

ఇప్పటికే జెమిని టీవీలో(Gemini TV) జూ. ఎన్టీఆర్ (Junior NTR) "ఎవరు మీలో కోటీశ్వరుడు" (Evaru Meelo Koteeswarudu) షో తో అభిమానులను అలరిస్తుండగా.. టిఆర్‌పి రేటింగ్ లో దూసుకుపోతున్న వీరికి అడ్డుకోటానికి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బిగ్‌బాస్ షో ప్రసారం చేయాలని 'స్టార్ మా' యాజమాన్యం నిర్ణయించుకుంది. ఈ సారి కూడా అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)హోస్ట్ గా (Bigg Boss Host)వ్యవరిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే!

ఇదిలా ఉండగా కంటెస్టెంట్స్ (Bigg Boss Contestants 2021)  గురించి ఎలాంటి సమాచారం విడుదల అవకున్నా.. కొంత మంది పేర్లు మాత్రం  బిగ్‌బాస్ హౌస్ లోకి వెళ్లనున్నట్లు సమాచారం. ముఖ్యంగా వారిలో నటి ప్రియ, కార్తీకదీపం ఉమాదేవి, 7ఆర్ట్స్ సరయు, నటుడు మానస్ షా, నటుడు సన్నీ, యాంకర్ రవి, ఆర్జే కాజల్, శ్వేతా వర్మ, లహరి షారి, కమెడియన్ లోబో,  టీవీ 9 యాంకర్ ప్రత్యూష, ఆట సందీప్, రఘు, కొత్తగా "జబర్దస్త్ వర్ష" పేరు కూడా వినపడుతున్నాయి. ఇందులో ఎంత వరకు నిజమో.. తెలియాలంటే మరి కొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే!

ఏదీ ఏమైనా... ఎవరు కంటెస్టెంట్స్ లుగా రాబోతున్నారనే విషయం తొందర్లోనే వెలువడనుంది. 

Also Read: Porcupine vs Leopard: చిరుతపులిని ఒక ఆటాడుకున్న ముళ్లపంది.. వైరల్ ఫోటోస్!

 

Trending News