నేడు రామ్ 'జిందగీ' ఆడియో రిలీజ్

Last Updated : Oct 13, 2017, 12:28 PM IST
నేడు రామ్ 'జిందగీ' ఆడియో రిలీజ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఉన్నది ఒకటే జిందగీ. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఈరోజు గ్రాండ్ గా జరగనుంది. హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ఈ సినిమా పాటల విడుదల వేడుక మరికొన్ని గంటల్లో అట్టహాసంగా జరగనుంది. ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను సాయంత్రం 7 గంటల నుంచి జీ సినిమాలు ఛానెల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

ఉన్నది ఒక్కటే జిందగీ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. రామ్-దేవిశ్రీ కాంబోలో ఇది ఐదో సినిమా కావడం విశేషం. గతంలో రామ్, దర్శకుడు కిషోర్ తిరుమల, దేవిశ్రీ కాంబినేషన్ లో నేను శైలజ సినిమా వచ్చింది. అందులో పాటలన్నీ హిట్ అయ్యాయి. మరీ ముఖ్యంగా “కాంపౌడ్ వాల్” అనే లిరిక్స్ తో సాగే సాంగ్ అయితే.. ఎక్కువ మంది చూసిన తెలుగు పాటగా యూట్యూబ్ లో రికార్డు సృష్టించింది. మళ్లీ ఈ కాంబినేషన్ లో ఉన్నది ఒక్కటే జిందగీ సినిమా వస్తోంది.

Trending News